ఒక‌ప్ప‌టి స్టార్ రైట‌ర్ కి కొత్త‌బ‌ట్ట‌లు పెట్టిన బాల‌య్య‌!

ఒక‌ప్పుడు స్టార్ రైట‌ర్ గా వెలిగిన చిన్న‌కృష్ణ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో యాక్ష‌న్ స్టోరీ లు అందిచ‌డంలో చిన్ని కృష్ణ స్పెష‌లిస్ట్;

Update: 2025-07-02 10:52 GMT

ఒక‌ప్పుడు స్టార్ రైట‌ర్ గా వెలిగిన చిన్న‌కృష్ణ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో యాక్ష‌న్ స్టోరీ లు అందిచ‌డంలో చిన్ని కృష్ణ స్పెష‌లిస్ట్ . కొన్నాళ్ల పాటు ఇండ‌స్ట్రీలో ఆయ‌న జ‌మానా న‌డిచింది. స్టార్ హీరోలెంద‌రికో స్టోరీలు అందించారు. సీమ సింహం, న‌ర‌సింహనాయుడు, ఇంద్ర ఇలా ఎన్నో హిట్ సినిమాల‌కు స్టోరీలు అందించారు. ముఖ్యంగా బాల‌య్య కు సీమ‌లో ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తీసుకొచ్చింది ఈ య‌న క‌థ‌లే.

అప్ప‌టికే చిరంజీవి వ‌రుస హిట్ల‌తో ఉండ‌గా, బాల‌య్య రోటీన్ ఫార్ములా సినిమాలు చేస్తోన్న స‌మ‌యంలో సీమ నేప‌థ్యం గల స్టోరీలు అందించి బాల‌య్య గ‌మ‌నాన్నే మార్చేసారు. అలా బాల‌య్య తో చిన్న కృష్ణ‌కు మంచి ర్యాపో ఏర్ప‌డింది. ఈ సంద‌ర్భంగా బాల‌య్య తో కెరీర్ ఆరంభంలో ఉన్న ఓ అనుభ‌వాన్ని పంచు కున్నారు. `బాలకృష్ణ గారికి న‌రసింహ నాయుడు క‌థ చెప్పడానికి వాళ్ల ఇంటికెళ్లాను.

అప్పుడు బాలకృష్ణ గారు పూజలో ఉన్నారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారని అప్పుడే తెలిసింది. ఆయ‌న్ని అలా చూడగానే సనాతన ధర్మాన్ని గుండెల నిండుగా నింపుకున్న వ్యక్తిగా కనిపించారు. నేను చెప్పిన కథ ఆయనకి కనెక్ట్ అయింది. దీంతో ఆయన నాకు కొత్త బట్టలు పెట్టి పంపించారు. ఆరోజు ఆయన చూపించిన ఆప్యాయత .. గౌరవం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

నరసింహనాయుడు సినిమా షూటింగు జరుగుతోన్న స‌మ‌యంలో స్పాట్ లో నేను ఉండేవాడిని. ఎలా వ‌స్తుందా? అని చూసుకునేవాడిని. నేను రాసిన డైలాగులు బాల‌య్యగారు ప‌లుకుతుంటే? గ‌ర్వంగా అనిపించింది. ఆ సినిమాలో ట్రైన్ సీన్ చాలా ఇష్టం` అని అన్నారు.

Tags:    

Similar News