'రామాయణ' రణబీర్ పై ట్రోల్స్.. చిన్మయి భారీ కౌంటర్
తాజాగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ పై వచ్చిన ట్రోల్స్ కు రెస్పాండ్ అయ్యి భారీ కౌంటర్ ఇచ్చారు.;
ప్రముఖ సింగర్ చిన్మయి గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతుంటారు. సినీ సెలబ్రిటీలపై నెటిజన్లు పెట్టిన పోస్టులకు, కామెంట్స్ కు స్పందిస్తుంటారు. ఆ సమయంలో ఆమె చేసే కామెంట్స్.. ఫుల్ గా నెట్టింట వైరల్ అవుతుంటాయి. కొన్ని రోజుల పాటు ట్రెండ్ అవుతూనే ఉంటాయి.
తాజాగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ పై వచ్చిన ట్రోల్స్ కు రెస్పాండ్ అయ్యి భారీ కౌంటర్ ఇచ్చారు. అయితే రణబీర్.. ఇప్పుడు రామాయణలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. రాముడిగా కనిపించనుండగా.. మేకర్స్ రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. విజువల్స్, బీజీఎం అన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.
దీంతో గ్లింప్స్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అప్పుడే ఓ నెటిజన్.. రణబీర్ పిక్ షేర్ చేస్తూ బీఫ్ తినేవాడు రాముడు పాత్ర పోషిస్తున్నాడంటూ పోస్ట్ పెట్టాడు. అతడు రాముడు పాత్ర పోషించడమేమిటోనని మరొకరు కామెంట్ పెట్టాడు. అప్పుడే చిన్మయి స్పందించి కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారని చెప్పాలి.
దేవుడి పేరుతో ఒక బాబాజీ రేపులు చేయొచ్చని, భక్త్ ఇండియాలో ఎన్నికల్లో ఓట్లు కోసం పేరోల్ మీద బయటకు రావచ్చని, కానీ ఎవరో ఏదో తిన్నారు అంటే అదే పెద్ద సమస్య కాదు కదా అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం అయిందనే చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు.
అయితే చిన్మయి.. ఒక చెడ్డ పని.. మరో చెడ్డ పనితో ఎలా జస్టిఫై చేస్తున్నారని నెటిజన్ అడిగాడు. దీంతో బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్రను పోషిస్తే మీకు సమస్య వస్తోంది.. రేపిస్టులు రాజ్యాన్ని ఏలుతుంటే మీకు ప్రాబ్లం లేదా అని మళ్లీ చిన్మయి ప్రశ్నించారు. అప్పుడు ఆ నెటిజన్ ఫెమినిజం, ఫెమినిస్ట్ వరకు ఉండండని అతిగా మాట్లాడాడు.
దీంతో దేవుడి పేరుతో అటెన్షన్ సీక్ చేయాలని చూసేవారు ఎప్పుడైనా నాశనం అయిపోతారని పెద్దలు చెబుతూ ఉంటారు కదా.. మీ ఇష్టం మీరు చూస్తారుగా అంటూ చిన్మయి మళ్లీ రిప్లై పెట్టారు. అప్పుడే మరో నెటిజన్. ఆసిన్ టాపిక్ ను లేవెనెత్తారు. అలా సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు తప్పుపడుతున్నారు.