చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్ సెలబ్రిటీస్.. జాబితా చూస్తే షాక్!

వెండితెరపై మెరిసే కొందరు స్టార్లను చూసినప్పుడు, వాళ్లు పుడుతూనే నటులుగా పుట్టారేమో అనిపిస్తుంది.

Update: 2026-07-16 09:21 GMT

వెండితెరపై మెరిసే కొందరు స్టార్లను చూసినప్పుడు, వాళ్లు పుడుతూనే నటులుగా పుట్టారేమో అనిపిస్తుంది. చిన్నప్పుడే కెమెరా ముందుకు వచ్చి, ముద్దు ముద్దు మాటలతో, అమాయకత్వంతో మన హృదయాలను గెలుచుకున్న ఎంతో మంది బాలనటులు, పెరిగి పెద్దయ్యాక అదే ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా మొదలై, ఈరోజు గ్లోబల్ స్థాయిలో స్టార్‌లైన వారి ప్రయాణాన్ని తెలుసుకుందాం..

టాలీవుడ్ స్క్రీన్‌ను ఏలుతున్న అప్పటి బుడతలు:

తెలుగు ఇండస్ట్రీలో చిన్నప్పుడే నటనలో ఓనమాలు నేర్చుకుని, ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం 4 ఏళ్ల వయసులోనే 'నీడ' సినిమాతో 1979 లో ఎంట్రీ ఇచ్చి, 'బాజారు రౌడీ', 'కొడుకు దిద్దిన కాపురం' లాంటి చిత్రాలతో బాలనటుడిగానే స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. ఇక 'బాల రామాయణం'లో రాముడిగా నటించి మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్, ఈరోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. చిరంజీవి, వెంకటేష్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అదరగొట్టిన తేజ సజ్జ 'హనుమాన్' సినిమాతో పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. ఇక కేవలం ఏడాది వయసులోనే 'సిసింద్రీ'గా థియేటర్లను ఊపేసిన అఖిల్ అక్కినేని ప్రయాణం కూడా ఇందులో ప్రత్యేకమైనదే.

సరిహద్దులు దాటిన బాలనటుల విశ్వరూపం:

ఇక ఇతర భాషల విషయానికి వస్తే, 1960లోనే 'కలత్తూర్ కన్నమ్మ' చిత్రంతో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి, తొలి సినిమాకే రాష్ట్రపతి అవార్డు అందుకున్న కమల్ హాసన్ ఈరోజు ఇండియన్ సినిమా లెజెండ్. ఇక తమిళంలో శింబు చిన్నతనంలోనే తన తండ్రి టి. రాజేందర్ దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో అలరించి ఆ తర్వాత స్టార్ హీరో అయ్యారు.

ఇక బాలీవుడ్ వైపు చూస్తే.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ 'యాదోన్ కి బారత్'లో, హృతిక్ రోషన్ 'ఆప్ కే దీవానే', 'భగవాన్ దాదా' చిత్రాల్లో, రణబీర్ కపూర్ తన హోమ్ బ్యానర్ సినిమాల్లో బాలనటులుగా కనిపించి, ఆ తర్వాత బాలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు.

వెండితెరను మెరిపించిన అప్పటి చిచ్చరపిడుగులు:

హీరోల కంటే ఒక అడుగు ముందే ఉండి, చిన్నతనంలోనే ఎమోషన్స్ పండించి, ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్లుగా ఎదిగిన నటీమణులు ఎందరో ఉన్నారు. భారతదేశపు మొదటి లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి చిన్నతనంలో 'మా నాన్న నూతన దేవుడు', 'తునైవన్' వంటి చిత్రాల్లో మురుగన్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక 'సీతామాలక్ష్మి'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన మీనా, 'గిరిజ కళ్యాణం'లో నటించిన రాశి, ఆ తర్వాత టాప్ హీరోల సరసన అగ్ర హీరోయిన్లుగా వెలిగారు.

ఇక మన దేశముదురు హీరోయిన్ హన్సిక కోయి మిల్ గయా తో నటిస్తే, ఇక 'మాసూమ్' సినిమాతో మెప్పించారు ఊర్మిళ, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'సంఘర్ష్'లో మెరిసిన అలియా భట్, శ్రియా శరణ్ లాంటి వారు బాలనటి నుండి స్టార్ హీరోయిన్లుగా తమ సత్తా చాటారు.

చిన్నప్పటి అమాయకత్వాన్ని దాటుకుని, కెమెరా భయాన్ని వీడి, పెద్దయ్యాక కూడా అదే ఫీల్డ్‌లో నిలదొక్కుకోవడం అంత సాధారణమైన విషయం కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న క్రేజ్‌ను స్టార్‌డమ్‌గా మార్చుకుని, ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న ఈ సెలబ్రిటీల ప్రయాణం నిజంగా అద్భుతం. ఇక తెరపై వీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి పాత్రలను, ఇప్పుడు స్టార్స్ గా చూస్తున్న పాత్రలను బేరీజు వేసుకుంటే అభిమానులకు ఒక మధురమైన అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News