• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోలీవుడ్ హీరో ఇంట్లోకి...

కోలీవుడ్ హీరో ఇంట్లోకి వరద నీరు.. సాయం కోసం ఇలా..

| చెన్నైలో మిగ్ జామ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఈ తుఫాన్ కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-12-05 11:00 GMT

చెన్నైలో మిగ్ జామ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఈ తుఫాన్ కారణంగా తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎయిర్ పోర్ట్, రైల్వేస్టేషన్స్, సబ్ వే లతో పాటు చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

అత్యవసర పనుల మీద బయటకు రాలేని పరిస్థితుల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు చెన్నైలో ఉన్న సినీ సెలబ్రిటీలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నే కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ఇంట్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఇదే విషయాన్ని అతను తన ట్విట్టర్ వేదికగా ఫోటోలతో సహా పంచుకున్నారు. ఈ మేరకు విష్ణు విశాల్ ట్వీట్ చేస్తూ..

" నా ఇంట్లోకి వరద నీరు చేరుతుంది. కరపాక్కంలో నీటిమట్టం దారుణంగా పెరుగుతోంది. నేను సహాయం కోసం పిలిచాను. కరెంటు లేదు, వైఫై లేదు, ఫోన్ సిగ్నల్ ఏమీ లేదు. మా ఇంటి పై ఉన్న టెర్రస్ మీద మాత్రమే నాకు కొంత సిగ్నల్ వస్తుంది. నాతో పాటు ఇక్కడున్న చాలా మందికి సహాయం అందుతుందని ఆశిస్తున్నా. చెన్నై అంతటా ఉన్న ప్రజలందరూ ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని నాకు తెలుస్తోంది" అంటూ రాస్కొచ్చాడు.

అంతేకాకుండా తన ఇంట్లో వరద నీరు చేరిన ఫోటోలను షేర్ చేశాడు. దీంతో విష్ణు విశాల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కాగా తమిళంలో ముండసుపట్టి', 'రాత్ససన్‌' ఎఫ్ఐఆర్, మట్టికుస్తీ వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. రీసెంట్ గా వచ్చిన 'మట్టి కుస్తీ' మూవీతో తెలుగు ఆడియన్స్ కి సైతం దగ్గరయ్యాడు. ప్రస్తుతం కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్నాడు.

హీరో గానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న లాల్ సలాం మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ హీరో.. ధనుష్ హీరోగా తెరకెక్కనున్న 50వ సినిమాలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఇక హీరోగా రామ్‌ కుమార్‌ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిల్మ్స్‌ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.

Water is entering my house and the level is rising badly in karapakkam
I have called for help
No electricity no wifi
No phone signal
Nothing
Only on terrace at a particular point i get some signal
Lets hope i and so many here get some help❤️
I can feel for people all over chennai… pic.twitter.com/pSHcK2pFNf

— VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 5, 2023
Tags:    
  • Floods 
  • Kollywoodhero 
  • Vishnuvishal 
  • Chennaifloods 
  • Chennaigovernment 
  • Electricityissues 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS