15 ని.ల ముందు వచ్చి ఉంటే.. నటి భర్త ఆవేదన!
'త్రినయని' సీరియల్‌లో తిలోతమ పాత్రతో ఫేమస్ అయిన పవిత్రా జయరామ్ మే 12న ఘోర ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే
'త్రినయని' సీరియల్‌లో తిలోతమ పాత్రతో ఫేమస్ అయిన పవిత్రా జయరామ్ మే 12న ఘోర ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం బెంగళూరు నుండి హైదరాబాద్‌కు తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమె భర్త, నటుడు చంద్రకాంత్ (అకా) చల్లా చంద్రుడు తన పరిస్థితికి తీవ్రంగా ఆవేదన చెందగా అది చూపరులను కలచివేసింది.
ఇంతకుముందే భార్య పవిత్రతో దిగిన చివరి ఫోటోని చంద్రకాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఈ ఫోటోలో అందమైన జంట సంతోషంగా ఉన్నారు.. వారు నవ్వుతూ కనిపించారు. పాపా దిగిరా.. నన్ను ఒంటరిగా వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. ఒకసారి మామా అని పిలువ్ .. నా పవి ఇక లేదు.. దయచేసి తిరిగి రా... అంటూ చంద్రకాంత్ ఎమోషనల్ అయ్యారు.
తాజాగా ప్రముఖ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చంద్రకాంత్ మాట్లాడుతూ.. తమ మధ్య అన్యోన్యతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. ఈ ఇంటర్వ్యూలో సంవత్సరం క్రితం పవిత్ర ఆత్మహత్యకు ప్రయత్నించింది! అంటూ ప్రచారం సాగుతోందని హోస్ట్ రోషన్ ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ ''అది (పవిత్ర) మంచిది .. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి!'' అంటూ మీడియాని వేడుకున్నాడు. ఇదే చాటింగ్ సెషన్‌లో 15 నిమిషాల ముందు అంబులెన్స్ వచ్చి ఉంటే నా భార్య బతికేది అంటూ ఆవేదన చెందాడు. దీనికి కామెంట్స్ సెక్షన్ లో అభిమానులు స్పందిస్తూ అంబులెన్స్ లు సమయానికి రావడం లేదని అన్నారు. గంటల కొద్దీ ఆలస్యంగా వస్తుండడంతో ప్రమాద బాధితుల పరిస్థితి తారుమారవుతోందన్న ఆవేదనా కనిపించింది.
పవిత్ర జయరామ్ గురించి..
పవిత్ర కన్నడ టీవీ షో జోకలితో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2018లో నిన్నే పెళ్లాడతాతో తెలుగు టీవీలో అడుగుపెట్టింది. కానీ త్రినయని సీరియల్‌లో తిలోత్తమ పాత్ర పోషించడం ఆమెకు ఇంటి పేరుగా మారింది. ఆమె భర్త చంద్రకాంత్ కూడా టీవీ సిరీస్‌లో నటించాడు. పవిత్ర భర్తగా చందు సీరియల్ లో నటించాడు.