హీరోల రెమ్యునరేషన్ల వెనుక అసలు లెక్కలివే.. బన్నీ వాసు
సినిమా హీరోల రెమ్యునరేషన్లు చూసి అవాక్కవ్వడం కామన్. వందల కోట్లు తీసుకుంటున్నారని బయట రకరకాల డిస్కషన్లు జరుగుతుంటాయి.;
సినిమా హీరోల రెమ్యునరేషన్లు చూసి అవాక్కవ్వడం కామన్. వందల కోట్లు తీసుకుంటున్నారని బయట రకరకాల డిస్కషన్లు జరుగుతుంటాయి. అయితే ఈ భారీ ఫిగర్స్ వెనుక ఉన్న అసలు వాస్తవాలు వేరని ప్రొడ్యూసర్ బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. హీరోల సంపాదన, వారి మెయింటెనెన్స్ ఖర్చులు, చివరగా నిర్మాత నెత్తి మీద పడే భారం గురించి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
స్టార్ హీరోలు ఒక్క సినిమాకు 200 కోట్లు తీసుకుంటున్నారనే టాక్ ఉంది కదా.. దాని వెనుక లాజిక్ ని బన్నీ వాసు విడమరిచి చెప్పారు. ఆ అమౌంట్ ఒక్క సినిమాకే అయినా, ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడానికి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. అంటే సింపుల్ గా ఇయర్లీ చూసుకుంటే వాళ్లకు వచ్చేది 50 కోట్లేనని, అది జనాలు అనుకుంటున్నంత భారీ మొత్తం కాదని ఆయన వివరించారు.
ఇక హీరోల లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఖర్చులైతే మామూలుగా ఉండవు. ఒక మిడ్ రేంజ్ హీరోకి ఏడాదికి 6 నుంచి 10 కోట్లు ఖర్చవుతుంటే, టాప్ స్టార్స్ కి మాత్రం నెలకు 2 కోట్లు దాకా అవుతోందట. అంటే కేవలం మెయింటెనెన్స్ కోసమే ఏడాదికి 20 నుంచి 25 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని బన్నీ వాసు లెక్కలతో సహా బయటపెట్టారు.
ఫిట్ నెస్, లుక్స్ కోసం హీరోలు పెట్టే ఖర్చు వింటే షాక్ అవ్వాల్సిందే. ఒక్క ఫిజికల్ ట్రైనర్ కే నెలకు 15 నుంచి 16 లక్షల వరకు జీతం పే చేయాల్సి ఉంటుందట. ప్రభుత్వానికి ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేసాక, చేతికి వచ్చిన డబ్బులో నుంచే ఈ ఖర్చులన్నీ భరించాలని, బయట కనిపించే గ్లామర్ వెనుక ఇంత తతంగం ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
సినిమా తేడా కొడితే మాత్రం దెబ్బ పడేది నిర్మాతకేనని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాప్ వచ్చినప్పుడు హీరోల ఇమేజ్ కి పెద్ద డ్యామేజ్ ఉండదు కానీ, ప్రొడ్యూసర్ మాత్రం ఆర్థికంగా చితికిపోతాడు. కొంతమంది హీరోలు రెమ్యునరేషన్ వెనక్కి ఇస్తుంటారు కానీ, అందరూ ఆ పని చేయరని, ఈ విషయంలో నిర్మాతలదే రిస్క్ అని ఆయన కుండబద్దలు కొట్టారు.
వీటికి తోడు ఓటీటీ ఎఫెక్ట్, పైరసీ, టికెట్ రేట్ల ఇష్యూస్ కూడా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నాయి. హీరోలకు టాలెంట్ ఉంది కాబట్టే అంత డిమాండ్ చేస్తున్నారు, కానీ లాస్ట్ కి లాస్ వస్తే ఆ పెయిన్ మాత్రం ప్రొడ్యూసరే భరించాల్సి వస్తోందని బన్నీ వాసు టాలీవుడ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ పై క్లియర్ కట్ గా మాట్లాడారు.