'బన్నీ వాసు నాయకత్వం వర్ధిల్లాలి'.. అల్లు అరవింద్ కౌంటర్!
అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి "బన్నీ వాసు నాయకత్వం వర్ధిల్లాలి" అంటూ గట్టిగా అరవగానే బన్నీ వాస్ సహా అంతా నవ్వేశారు.;

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మీడియం అండ్ చిన్న రేంజ్ సినిమాలు GA2 బ్యానర్ పై రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఆ సంస్థ నిర్మించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించాయి కూడా.
ఇప్పుడు బీవీ వర్క్స్ అంటూ కొత్త బ్యానర్ ను స్టార్ట్ చేసి.. మిత్రమండలి మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ విజయేందర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను బన్నీ వాస్ సమర్పిస్తున్నారు. యువ నటులు ప్రియదర్శి , ప్రసాద్ బెహరా, రాగ్ మయూర్, విష్ణు, సోషల్ మీడియా ఫేమ్ నిహారిక ఎన్ ఎమ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
తాజాగా మిత్రమండలి మేకర్స్ టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, బన్నీ వాస్ మాట్లాడారు. సినిమా కోసం యంగ్ స్టర్స్ నే ఎక్కువగా తీసుకున్నామని చెప్పారు. అందుకు స్ఫూర్తి జాతిరత్నాలు మూవీ అని పేర్కొన్నారు. నలుగురు కుర్రాళ్లు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలాగే ఉంటుందని బన్నీ వాస్ తెలిపారు.
మిత్రమండలి మూవీ కోసం యంగ్ టీమ్ అంతా ఎంతో శ్రమించి వర్క్ చేస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారని, తాము సపోర్ట్ చేసినట్లు తెలిపారు. ప్యూర్ గా ఒక యంగ్ బ్యాచ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో.. అదే ఈ మూవీ అని అన్నారు. సినీ ప్రియులు కచ్చితంగా కడుపుబ్బా నవ్వుకుంటారని బన్నీ వాస్ వెల్లడించారు.
అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి "బన్నీ వాసు నాయకత్వం వర్ధిల్లాలి" అంటూ గట్టిగా అరవగానే బన్నీ వాస్ సహా అంతా నవ్వేశారు. ఇది పాలకొల్లు కాదు.. AAA అంటూ ఏదో చెప్పబోయారు. ఇంతలో అక్కడే ఉన్న అల్లు అరవింద్.. వాడికి గట్టిగా పేమెంట్ ఇచ్చినట్టున్నావే అంటూ సరదాగా గట్టిగా నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు.
దానికి బన్నీ వాస్, తాను అరవింద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్పమని ఎస్కేఎన్ కు చెప్పానని.. కాకపోతే నన్ను ఇరికించడానికి అలా చేశారని నవ్వుతూ అన్నారు బన్నీవాస్. మొత్తానికి అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ప్రియులు దానిని షేర్ చేస్తూ ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు.