కంటెంట్ పై ఫోకస్ పెట్టండి.. తెలుగు నిర్మాతలకు బన్నీ వాస్ రిక్వెస్ట్
ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ బన్నీ వాస్ టాలీవుడ్ నిర్మాతలకు ఓ రిక్వెస్ట్ చేశారు.;
యూత్ ఫుల్ లవ్ కామెడీ డ్రామా లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నెల 05న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ యూత్ ఫుల్ డ్రామాకు యువత నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా సినిమా లాభాల్లోకి వెళ్లిపోయింది.
దీంతో మేకర్స్ హైదరాబాద్ లో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్ లో నిర్మాతలు బన్నీ వాస్, శీ నందిపాటి ఈ చిత్రాన్ని చూసిన తర్వాత కంటెంట్ పై నమ్మకంతో థియేటర్లలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ బన్నీ వాస్ టాలీవుడ్ నిర్మాతలకు ఓ రిక్వెస్ట్ చేశారు. చిన్న సినిమాలను కంటెట్ నమ్మి రూపొందించాలని అన్నారు. తెలుగు సినిమా నిర్మాతలు కంటెంట్‌ను నమ్మాలని, చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి తొందరపడవద్దని అభ్యర్థన చేశారు. కేవలం కంటెంట్ పైనే దృష్టి పెట్టి, ఇంప్రెసివ్ సినిమాలు చేయాలని ఆయన కోరారు.
అందరు నిర్మాతలకు ఒక చిన్న అభ్యర్థన. చిన్న సినిమాలు బాగా ఆడటం చూసి చాలా మంది సంతోషంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కంటెంట్. కంటెంట్ ను నమ్మకుండా తొందరపడి చిన్న సినిమాలు చేయకండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అని బన్నీ వాస్ కోరారు. కాగా, ఈ సినిమా తొలి వారంలోనే లాభాల్లోకి వెళ్లిపోయింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను రూ.2.5 కోట్లకు బన్నీ వాసు కొనుగోలు చేశారు. దీంతోపాటు ప్రమోషన్స్ కు రూ.1.25 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
అయితే ప్రమోషన్స్ బాగుండడంతో సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. దీంతో సినిమా ఓవరాల్ బడ్జెట్ కంటే.. తొలి రోజు సినిమాకు వచ్చిన కలెక్షన్లే ఎక్కువ అని నటుడు మౌళి తెలిపారు. ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.21.50 (గ్రాస్) కోట్లు సాధించగా, రూ.11.5 కోట్లు (షేర్) అందుకుంది. దీంతో దాదాపు రూ.8 కోట్ల లాభాల్లో కొనసాగుతుంది.
కాగా, లిటిల్ హార్ట్స్ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. 90s బయోపిక్ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్, ఈటీవీ విన్ తో కలిసి ఈ యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ ను నిర్మించారు. మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నగరం, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు.