డిజాస్టర్లకు పోస్టర్ల డబ్బులు కూడా రావట్లేదు
అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్ల ప్రకారం, ప్రొడక్షన్ పరంగా నిర్మాతలెవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడిగితే దానికి నిర్మాత బన్నీ వాసు చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపచేసేదిలా ఉంది.;
ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, అందులోని సినిమాల పరిస్థితి ఒకప్పటిలా లేవు. ఒకప్పుడు సినిమా ఎలా ఉందంటే బావుంది, బాలేదు, సూపర్‌హిట్, బ్లాక్ బస్టర్, అట్టర్ ఫ్లాప్ అనే పదాలు వాడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సినిమాకు ఒకప్పటిలా లాంగ్ రన్ కూడా లేదు. లాంగ్ రన్ లేక చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అవుతున్న సందర్భాలు చాలానే చూశాం.
అయితే ఏ రోజైనా సరే కంటెంట్ ఈజ్ కింగ్ అని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. సినిమాలో కంటెంట్ ఉండి, దాన్ని ఆడియన్స్ కు అర్థమయ్యేలా చెప్పిన సినిమాలు మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవవు. కొన్ని సినిమాల్లో కథ బావున్నా దాన్ని సరిగ్గా చెప్పలేకపోతే ఆ సినిమాలు ఫ్లాపులుగా నిలిచి నిర్మాతలకు లేనిపోని నష్టాలను మిగల్చడం తప్ప ఏమీ ఉండదు.
అయితే ఇప్పుడున్న సిట్యుయేషన్ల ప్రకారం, ప్రొడక్షన్ పరంగా నిర్మాతలెవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడిగితే దానికి నిర్మాత బన్నీ వాసు చెప్పిన సమాధానం అందరినీ ఆలోచింపచేసేదిలా ఉంది. రీసెంట్ గా జరిగిన ఓ సినీ కార్యక్రమానికి గెస్టుగా హాజరైన బన్నీ వాసు ఈ విషయంతో పాటూ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
మినిమం సేఫ్ అనే మాటను మర్చిపోయారు
మనం వెనుకపడి పోతున్నామని సినిమాలు చేస్తే డబ్బులు పోతాయని, మన పేరు, మన బ్యానర్ పేరుని ఆడియన్స్ మర్చిపోతున్నారని తొందరపడి సినిమాలు చేస్తే ఏం రాదని, ఒకప్పటిలా మినిమం సేఫ్ అనే మాట ఇప్పుడు లేదని, ఇప్పుడు రెండే ఉన్నాయని, ఒకటి డిజాస్టర్, ఇంకోటి సూపర్‌హిట్ అని, సూపర్ హిట్ అయితేనే డబ్బులు మిగులుతాయి, డిజాస్టర్ అయితే పోస్టర్ల డబ్బుల కూడా రావట్లేదని ఎంత పెద్ద సినిమాలకైనా, చిన్న సినిమాలకైనా ఇదే జరుగుతుందని మినిమం సేఫ్ అనే మాటను అందరూ మర్చిపోయారని బన్నీ వాసు అన్నారు. మరి ఈ మాటల్ని బన్నీ వాసు స్వీయ అనుభవంతో చెప్పారా లేదా ఎవరినైనా ఉద్దేశిస్తూ చెప్పారా అనేది ఆయనకే తెలియాలి.