• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిన్న పృథ్వీరాజ్ కు బంపర్...

చిన్న పృథ్వీరాజ్ కు బంపర్ ఆఫర్.. ఆ పాత్రే మళ్లీ

| బాహుబలి తర్వాత ఇన్నాళ్లకు ఈ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

By - Tupaki Desk
Update: 2023-12-24 02:30 GMT

ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ విన్నా ఒక్కటే మాట వినిపిస్తుంది. అదే సలార్. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ఇన్నాళ్లకు ఈ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఎక్కువగా డైలాగులు లేకపోయినప్పటికీ కటౌట్ తోనే అందరినీ మెప్పించారు ప్రభాస్.

ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్లను పెద్దగా నిర్వహించలేదు సలార్ మేకర్స్. రాజమౌళి ఇంటర్వ్యూ కాకుండా ఇంకే విధంగా చిత్ర బృందం సందడి చేయలేదు. కానీ మూవీ విడుదలైన తర్వాత సినిమాలోని నటీనటుల ఇంటర్వ్యూలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సలార్ మూవీలో చిన్నప్పటి పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ నటించాడు. ప్రస్తుతం తాను పదో తరగతి చదువుకుంటున్నట్లు ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన సొంతూరు ప్రకాశం జిల్లా అని, కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యామని చెప్పాడు. ఓ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా తనకు సలార్ ఆడిషన్స్ కు వెళ్లే ఛాన్స్ వచ్చిందని చెప్పాడు.

మూవీ ఆడిషన్స్ కు అనేక మంది వచ్చారని, కానీ తన యాక్టింగ్ నచ్చడంతో ప్రశాంత్ నీల్ ఛాన్స్ ఇచ్చారని కార్తికేయ దేవ్ తెలిపాడు. అయితే సలార్ మూవీలో యాక్టింగ్ చూసి తనకు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో ఆఫర్ ఇచ్చారని చెప్పాడు. లూసిఫర్ సీక్వెల్ లో పృథ్వీరాజ్ చిన్నప్పటి రోల్ కు ఆయనే తనను సెలెక్ట్ చేశారని వెల్లడించాడు. లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

అయితే కార్తికేయ దేవ్.. టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ బంధువు అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ బ్రదర్ కొడుకే కార్తికేయ అని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి రోల్ లో కార్తికేయ అద్భుతంగా నటించాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లూసిఫర్-2లో ఛాన్స్ దక్కించుకోవడంతో నక్క తోక తొక్కాడని అంటున్నారు.

Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Prithviraj 
  • Prashanthneel 
  • Karthikeyadev 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS