• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RC 16 లాంచ్.. బుచ్చిబాబు...

RC 16 లాంచ్.. బుచ్చిబాబు పెద్దోళ్ళందరిని దించేశాడు!

| మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న తన 16వ సినిమా ఎట్టకేలకు మొదలయ్యింది

By - Tupaki Desk
Update: 2024-03-20 07:21 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న తన 16వ సినిమా ఎట్టకేలకు మొదలయ్యింది. నేడు పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. ఎంతో కాలంగా దర్శకుడు బుచ్చిబాబు ఈ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించడానికి ఎదురుచూస్తూ ఉన్నాడు. ఉప్పెన సినిమా వచ్చి దాదాపు మూడేళ్లయ్యింది.

అయితే ఈ మధ్యకాలంలో అతనికి చాలా రకాల ఆఫర్స్ వచ్చాయి. కానీ నెక్స్ట్ చేస్తే పెద్ద హీరోతోనే సినిమా చేయాలి అని పట్టుదలతో ఎంతో ఓపికతో కథను సిద్ధం చేసుకున్నాడు. ఇక మొత్తానికి అతను అనుకున్నట్లుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా లాంచ్ వేడుకకు అతను పెద్దోళ్లతోనే కనిపించడం హైలైట్ గా నిలిచింది.

వన్ నేనొక్కడినే సినిమాకు క్లాప్ బోర్డు పట్టుకున్న బుచ్చిబాబు ఇప్పుడు RC 16 తో అగ్ర తారలతో సమానంగా నిలుచున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా రెహమాన్ ను ఒప్పించడం అంత ఈజీ కాదు. ఆయన కంటెంట్ నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటారు. ఇక బుచ్చిబాబు రెండవ సినిమా అయినప్పటికీ అతని స్క్రిప్ట్ విన్న వెంటనే రెహమాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక దర్శకుడు శంకర్ తో పాటు అతని గురువు సుకుమార్ కూడా వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వేడుకకు వచ్చే బుచ్చిబాబుకు ప్రత్యేకంగా విషెస్ అందించాడు. మైత్రి మూల మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి హైదరాబాదులోని ఒక హోటల్ లో సినిమాను కనులు విందుగా లాంచ్ చేశారు.

అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ రామ్ చరణ్ కు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆమె కూడా గోల్డెన్ శారీలో మెరుస్తూ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మొత్తానికి దర్శకుడు తన రెండవ సినిమా లాంచ్ వేడుకలోనే బిగ్గెస్ట్ స్టార్స్ ను రంగంలోకి దింపాడు.

ఇక ఈ సినిమాలో ప్రముఖ నటులు కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక రెహమాన్ కూడా చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉండడం విశేషం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతో ఉన్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

#MegastarChiranjeevi & Mega Powerstar #RamCharan Royal Entry at #RC16PoojaCeremony! 🔥🔥#RC16 #Chiranjeevi #JanhviKapoor #BuchiBabuSana #ARRahman pic.twitter.com/C0KwApXYWM

— Sai Satish (@PROSaiSatish) March 20, 2024

GLOBAL STAR @AlwaysRamCharan garu from the grand opening ceremony of most anticipated #RC16❤️‍🔥#JanhviKapoor @BuchiBabuSana
Wishing all the very best to our dearest #RamCharan garu & entire team 👍🤗 pic.twitter.com/9dUH4iMLQU

— SivaCherry (@sivacherry9) March 20, 2024
Tags:    
  • Buchibabusana 
  • RC16movie 
  • Ramcharan 
  • Chiranjeevi 
  • Tollywood 
  • Buchibaburc16 
  • Janvhikapoor 
  • RC16launch 

Similar News

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

Copyright @2026

Powered by Blink CMS