బుచ్చిబాబు.. తగ్గుతాడా? ఆగుతాడా?

‘ఉప్పెన’తోనే బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. మొదటి సినిమాతో పెద్ద హిట్ అందుకుని, రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది.

Update: 2026-08-24 17:12 GMT

‘ఉప్పెన’తోనే బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. మొదటి సినిమాతో పెద్ద హిట్ అందుకుని, రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. అక్కడినుంచి సహజంగానే ఆయన రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగింది. ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిలో రావడంతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా కూడా అదే లీగ్ హీరోతో ఉంటుందేమో అనిపించింది.

‘పెద్ది’ భారీ అంచనాలతో వచ్చింది. తెలుగులో కొంతవరకు వసూళ్లు వచ్చినా, ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేదు. పాన్ ఇండియా మార్కెట్‌లో కూడా బుచ్చిబాబుకు పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఒకవేళ ఈ సినిమా భారీ విజయం సాధించి ఉంటే ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోలకు కథ చెప్పే ఛాన్స్ ఇంకా ఈజీగా వచ్చేది. తమిళం లేదా ఇతర భాషల్లో కూడా పెద్ద హీరోల దగ్గరకు వెళ్లే దారి ఓపెన్ అయ్యేదేమో.

ఇప్పుడు అసలు మ్యాటర్ ఏమిటంటే.. బుచ్చిబాబు మళ్లీ అదే రేంజ్ స్టార్ కోసం వెయిట్ చేస్తాడా? లేక ‘ఉప్పెన’ టైమ్‌లా కథను ముందు పెట్టి మీడియం రేంజ్ హీరోతో సినిమా చేస్తాడా? రెండో దారి కూడా తప్పు కాదు. నిజానికి ఒక దర్శకుడికి మళ్లీ బలమైన కంటెంట్‌తో హిట్ రావడం చాలా అవసరం. స్టార్ హీరో పేరు లేకపోయినా కథే మాట్లాడితే ఆయనకు మళ్లీ మార్కెట్ తెరుచుకోవచ్చు.

కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఇది అంత ఈజీ కాదు. రామ్ చరణ్ లాంటి హీరోతో భారీ సెట్స్, పెద్ద బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్ చూసిన దర్శకుడు వెంటనే చిన్న స్కేల్‌కు రావడం మనసుకు కూడా కాస్త కష్టం. ఇండస్ట్రీలో ఒకసారి రేంజ్ పెరిగితే అదే స్థాయిలో కొనసాగాలని దర్శకుడికీ ఉంటుంది. నిర్మాతలు కూడా అతన్ని అదే లీగ్‌లోనే చూస్తారు.

అక్కడే కొన్నిసార్లు దర్శకులు గ్యాప్‌లో పడిపోతారు. పెద్ద హీరో డేట్స్ కోసం వెయిట్ చేస్తూ సంవత్సరాలు పోతాయి. మరోవైపు చిన్న లేదా మీడియం హీరోతో సినిమా చేస్తే “రేంజ్ తగ్గిందా?” అనే మాటలు వస్తాయి. కానీ చివరకు దర్శకుడి కెరీర్‌ను నిలబెట్టేది హీరో పేరు కాదు.. అతను తీసిన సినిమా. ఈ విషయంలోనే దర్శకుడు బాగా ఆలోచించాల్సి ఉంటుంది. బుచ్చిబాబు ‘ఉప్పెన’తో బలమైన కంటెంట్ ఇచ్చాడు. ‘పెద్ది’తో భారీ సినిమా హ్యాండిల్ చేసిన అనుభవం కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటాడన్నదే కీలకం. మళ్లీ పెద్ద స్టార్ కోసం ఆగి వెళ్తాడా, లేక బలమైన కథతో వెంటనే మరో హీరోను దింపుతాడా అనేది చూడాలి.

Tags:    

Similar News