బుచ్చిబాబు హ్యాట్రిక్ అత్యంత జాగ్ర‌త్త‌గా!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా కొనసాగుతున్నారు.

Update: 2026-08-19 06:09 GMT

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా కొనసాగుతున్నారు. తొలి సినిమా `ఉప్పెన`తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి సత్తా ఏంటో నిరూపించు కున్నారు. అటుపై రెండో సినిమా `పెద్ది`తో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి తన రేంజ్‌ను మరింత పెంచుకున్నారు. ఇలా బ్యాక్-టు-బ్యాక్ భారీ విజయాలతో దూసుకుపోతున్న బుచ్చిబాబు కెరీర్‌లో మూడవ‌ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి.

తొలి రెండు సినిమాలతోనే భారీ విజయాలను అందుకున్న బుచ్చిబాబుకు మూడో చిత్రం అత్యంత కీలకమైన మైలురాయిగా మారనుంది. ఈసారి బుచ్చి టార్గెట్ మరింత పెద్దదిగా ఉండబోతోంది. కనీసం 600 కోట్ల మార్క్‌ను టార్గెట్ చేసేలా? సరికొత్త గ్లోబల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ రేంజ్ విజయం సాధించాలంటే బుచ్చిబాబు ఎంచుకునే కథ వంద శాతం పాన్-ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అందుకే ఆయన ప్రతి అడుగును అత్యంత జాగ్రత్తగా.. ఆచితూచి వేస్తున్నారు.

ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా తెరకెక్కించడానికి బుచ్చిబాబుకు ఆ స్థాయి ఇమేజ్ ఉన్న హీరో కూడా అవసరం. పాన్-ఇండియా మార్కెట్‌లో సత్తా చాటగల అగ్ర హీరోతో సినిమాను పట్టాలెక్కించేందుకు బుచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద హీరోల డేట్స్, వారి లైనప్‌ను బట్టి తన కథకు సరిపోయే సరైన నటుడిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు బుచ్చిబాబు. కథా చర్చలు .. ప్రీ-ప్రొడక్షన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు రెండు సినిమాలతోనూ డిఫరెంట్ జోనర్లను టచ్ చేసి సక్సెస్ సాధించిన బుచ్చిబాబు మూడో సినిమాతో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ హంగులతో పాటు బలమైన భావోద్వేగాలు ఉండే కథాంశాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములాను నమ్ముకుంటూనే హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారుట‌.

మరో హిట్ పడితే దర్శకుడిగా బుచ్చిబాబు ఖాతాలో తొలి హ్యాట్రిక్ నమోదవుతుంది. టాలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి మూడో సినిమా అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం పరిశ్రమలో అందరి చూపు బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే ఉంది. అత‌డు ఎలాంటి పాయింట్ తీసు కుంటారు? ఏ హీరోను ఎంపిక చేసుకుంటారు? ప్ర‌త్యేకించి అత‌డి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌వుతారు? అన్న‌ది ఈ రెండింటిని మించి హైలైట్ అవుతుంది.

ఎందుకంటే? రెండ‌వ సినిమాకే వ‌ర‌ల్డ్ క్లాస్ సంచ‌న‌లం రెహ‌మాన్ ను ఏరికోరి మ‌రీ తెచ్చుకున్నారు. దీంతో సంగీతం ప‌రంగా బుచ్చిబాబు టేస్ట్ పీక్స్ లో ఉంద‌ని అప్పుడే అర్ద‌మైంది. అత‌డి న‌మ్మ‌కాన్ని కూడా రెహ‌మాన్ నిలబెట్టారు. ఈ నేప‌ థ్యంలో మూడ‌వ సినిమాకు అందులోనూ హిట్ ప‌డితే హ్యాట్రిక్ న‌మోద‌వుతుంది కాబ‌ట్టి ఈసారి కూడా రెహ‌మాన్ రేంజ్ ఉన్న సంగీత ద‌ర్శ‌కుడినే తీసుకునే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News