• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుమ వారసుడి బబుల్ గమ్.....

సుమ వారసుడి బబుల్ గమ్.. ఇది కలెక్షన్స్ పరిస్థితి

| యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-01-03 03:55 GMT

యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిర్మల కాన్వెంట్ తో యాక్టర్ గా డెబ్యూ చేసిన రోషన్ తాజాగా బబుల్ గమ్ మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా క్షణం ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 29న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

కొడుకు హీరోగా డెబ్యూ మూవీ కావడంతో సుమ కనకాల అన్ని తానై ప్రమోషన్స్ చేసింది. వీలైనంత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కంటెంట్ కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో కచ్చితంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందని అంచనా వేశారు. యూత్ ఎలాంటి కథలని ఈ మధ్య భాగా ఇష్టపడుతున్నారని బేబీ మూవీ ప్రూవ్ చేసింది.

అందుకే బబుల్ గమ్ కూడా కనెక్ట్ అవుతుందని అనుకున్నారు. అయితే సలార్ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఈ మూవీ రిలీజ్ కావడంతో డార్లింగ్ ఇంపాక్ట్ రోషన్ మీద పడింది. అదే రోజు కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా రిలీజ్ కావడంతో బబుల్ గమ్ మూవీపైన ఆడియన్స్ ఫోకస్ లేకుండా పోయింది. సినిమాకి పర్వాలేదనే టాక్ వచ్చిన కూడా రాంగ్ టైం రిలీజ్ కారణంగా కలెక్షన్స్ మీద ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 75 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 35 లక్షల షేర్ ఉంది. ఈ సినిమాపై 2.3 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కనీసం 50 లక్షల షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఆడియన్స్ కూడా ఇంకా సలార్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు తప్ప బబుల్ గమ్ వైపు కాన్సంట్రేషన్ చేయడం లేదు.

దీంతో మొదటి సినిమాతోనే రోషన్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో వెంటనే మరో సినిమా కూడా రోషన్ కి ఒకే అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాతో తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మోడలింగ్ నుంచి ఈ బ్యూటీ హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఈమె కూడా గ్లామర్, రొమాంటిక్ షో భాగా చేయడంతో అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Tags:    
  • Roshankanakala 
  • Sumakanakala 
  • Bubblegummovie 
  • Bubblegumcollections 
  • Filmindustry 
  • Devilmovie 
  • Kalyanram 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS