అక్కడి నుంచి అఖండ 3 మొదలవుతుంది
ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో అఖండ 2 సినిమా చేశారు.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది.;
ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో అఖండ 2 సినిమా చేశారు.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. గతంలో వచ్చిన అఖండ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 3D హంగులతో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాదులో మీడియాతో ముచ్చటించారు బోయపాటి శ్రీను. ఈ క్రమంలోనే పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఈయిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
మీడియా సమావేశంలో భాగంగా శివుడు నేపథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాలకు విడుదల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మీ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించగా దీనికి బోయపాటి మాట్లాడుతూ.. "ఇది శివుడిపై చిత్రీకరించిన సినిమా కాదు కాబట్టి నాకు అలాంటి భయం లేదు. ఆయన భక్తుడైన అఘోర సినిమా మాత్రమే. ఈ సినిమాలో అఖండ తల్లికి - శివుడికి మధ్య వచ్చే ఎపిసోడ్లోనూ ఆ విషయాన్ని మేము తెలియజేశాము.. గతంలో ఏదో జరిగింది కాబట్టి ప్రతిసారి అదే జరుగుతుందని ఏమీ లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ముహూర్తం చూసుకొని సినిమా మొదలు పెడతారు. అయితే అలా మొదలైన ప్రతి సినిమా కూడా మంచి విజయం అవ్వట్లేదు కదా.. కొన్ని హిట్ అవుతున్నాయి. మంచి కార్యం చేసినప్పుడు అడ్డు ఆటంకాలు ఎదురవడం సహజం. కానీ మనలో సంకల్పబలం గొప్పగా ఉండాలి. అప్పుడే ఏం జరిగినా ధైర్యంగా ముందడుగు వేస్తాము" అంటూ చెప్పుకొచ్చారు బోయపాటి శ్రీను.
అలాగే అఖండ 3 గురించి కూడా మాట్లాడుతూ.. "అవెంజర్స్ స్థాయి లో స్కోప్ వున్న సినిమా ఇది. నిజానికి అవెంజర్స్ అనేవి రచయితలు పుట్టించిన సూపర్ హీరోలు.. కానీ మనకు అలాంటి సూపర్ హీరోలు నిజంగానే ఉన్నారు. అధర్వణ వేదం నుంచే ఆయుధాలు పట్టిన జాతి మనది..కురుక్షేత్రంలోనే మన ఊహకందని ఎన్నో రకాల ఆయుధాలు వాడారు.. దీంట్లో నుంచి ఎన్ని కథలనైనా.. ఎంతమంది సూపర్ హీరోలనైనా మనం తీసుకోవచ్చు. కానీ మనకు ఉండాల్సింది సంకల్పం.. ఓపిక మాత్రమే
.. ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని వెంట వెంటనే సీక్వెల్స్ తీస్తే బోర్ కొట్టేస్తుంది.. అందుకే రెండు, మూడు సినిమాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తాను.
అఖండ 2లో క్లైమాక్స్ లో శంభాల తలుపులు తెరుచుకోవడాన్ని చూపించాము. అక్కడి నుంచి అఖండ 3 మొదలవుతుంది అంటూ తెలిపారు బోయపాటి శ్రీను. మొత్తానికైతే అఖండ 3పై క్లారిటీ ఇస్తూ అసలు ఎక్కడి నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
బోయపాటి తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ.. నాకు ప్రతి జానర్ లో సినిమా చేయాలనుంది. ఏదైనా అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న తర్వాతే ప్రకటిస్తాను. నా తదుపరి ప్రాజెక్టు వివరాలను మరో 10 రోజుల్లో తెలియజేస్తాను అంటూ తెలిపారు.