బుక్ మై షో టాప్ బుకింగ్స్.. ఆడియెన్స్ మూడ్ ఎలా ఉందంటే?
ఒకప్పుడు సినిమాకు క్రేజ్ ఉందో లేదో తెలియాలంటే, ఫస్ట్ డే థియేటర్ల దగ్గర జాతరను చూడాలి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం 'బుక్ మై షో' (Book My Show) యాప్‌లోకి షిఫ్ట్ అయింది;
ఒకప్పుడు సినిమాకు క్రేజ్ ఉందో లేదో తెలియాలంటే, ఫస్ట్ డే థియేటర్ల దగ్గర జాతరను చూడాలి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం 'బుక్ మై షో' (Book My Show) యాప్‌లోకి షిఫ్ట్ అయింది. అసలైన ఫెస్టివల్, అసలైన హైప్.. బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడే తెలిసిపోతోంది. గంటకు ఎన్ని లక్షల టికెట్లు తెగుతున్నాయన్నదే ఇప్పుడు సినిమా రేంజ్‌కు అసలైన మీటర్.
లాక్‌డౌన్ తర్వాత ఆడియెన్స్ హ్యాబిట్స్ పూర్తిగా మారిపోయాయి. ప్రతీ ఒక్కరూ ఆన్‌లైన్ బుకింగ్‌కే అలవాటు పడ్డారు. ఇది కార్పొరేట్ బుకింగ్స్ అనే కొత్త పదాన్ని పరిచయం చేసినా, అసలు సిసలైన ఆర్గానిక్ హైప్ ఉంటే తప్ప BMS క్రాష్ అవ్వదు. ఈ విషయంలో కొన్ని సినిమాలు చరిత్ర సృష్టించాయి. ఆడియెన్స్ ఒక సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ఈ నంబర్లే ప్రూవ్ చేశాయి.
ఈ ఆల్ టైమ్ రికార్డ్ లిస్ట్ చూస్తే, ఆడియెన్స్ పల్స్ క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్లు దేనికి కనెక్ట్ అవుతున్నారో, దేనికి బ్రహ్మరథం పడుతున్నారో ఈ లిస్ట్ చెబుతోంది. ముఖ్యంగా, 'పుష్ప 2' క్రియేట్ చేసిన రికార్డ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ హైప్ ఇంకొన్ని ఏళ్లపాటు సేఫ్‌గా ఉంటుంది.
ఆల్ టైమ్ హయ్యస్ట్ 'బుక్ మై షో' టికెట్ సేల్స్ రికార్డ్స్ ఇవే
పుష్ప 2: ది రూల్ (20.41 మిలియన్లు)
కల్కి 2898 AD (13.14 మిలియన్లు)
ఛావా (12.58 మిలియన్లు)
జవాన్ (12.40 మిలియన్లు)
కాంతార: చాప్టర్ 1 (11.17 మిలియన్లు)
స్త్రీ 2 (11.16 మిలియన్లు)
ఈ లిస్ట్ ఒక ట్రెండ్‌ను సెట్ చేసిందని చెప్పవచ్చు. ఈ ఆరు సినిమాల్లో కామన్ పాయింట్ఏమిటంటే.. పుష్ప 2, కాంతార 1, స్త్రీ 2.. ఇవన్నీ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీలు. అంటే, ఆడియెన్స్ ఒక నమ్మకంతో టికెట్లు కొన్నారు. ఇక కల్కి 2898 AD ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడని ఒక విజువల్ వండర్, ఒక పెద్ద స్కేల్.
మరోవైపు జవాన్, ఛావా.. పక్కా మాస్ ఎంటర్‌టైనర్లు. దీన్నిబట్టి ఆడియెన్స్ మూడ్ ఎలా ఉందో కొంత అర్ధమవుతుంది. మాకు రొటీన్ సినిమాలు వద్దు. మీ సినిమా కోసం మేము అడ్వాన్స్‌గా టికెట్లు కొనాలంటే, మాకు ఒక ఫెస్టివల్ లాంటి సినిమా ఇవ్వండి, లేదా ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ ఇవ్వండని అంటున్నారు. ఇక ఫ్రాంచైజీ బ్రాండ్, లేదా ఊహకందని స్కేల్.. ఈ రెండూ ఉంటే తప్ప, జనాలు ఎగబడి టిక్కెట్లు బుక్ చేసుకోవడం లేదనేది అసలు నిజం. ఇక ఈ లిస్ట్ రాబోయే ప్రొడ్యూసర్లకు ఒక పెద్ద లెసన్ లాంటిదని చెప్పవచ్చు.