బొమ్మరిల్లు టు జాక్.. డైరెక్టర్ నెక్స్ట్ ఏంటి..?
బొమ్మరిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ భాస్కర్ ఆ సినిమా టైటిల్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.;
బొమ్మరిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ భాస్కర్ ఆ సినిమా టైటిల్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. బొమ్మరిల్లు తర్వాత అల్లు అర్జున్ తో పరుగు సినిమా తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నాడు. ఐతే ఆ తర్వాత తీసిన ఆరెంజ్ సినిమానే అతన్ని కెరీర్ లో వెనకపడేలా చేసింది. ఆరెంజ్ సినిమా రిలీజ్ టైం లో ఆడియన్స్ కి ఎక్కలేదు అందులోని సాంగ్స్ ఇప్పటికీ క్రేజీగా ఉంటాయి. అంతేకాదు రీ రిలీజ్ టైం లో ఆరెంజ్ సూపర్ అనేసినా 15 ఏళ్ల క్రితం అది రిలీజైన టైం లో డిజాస్టర్ చేశారు.
ఐదేళ్లు ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న భాస్కర్..
ఇక ఆ తర్వాత రాం తో ఒంగోలు గిత్త చేశాడు కానీ అది కూడా మిస్ ఫైర్ అయ్యింది. ఆ నెక్స్ట్ తెలుగులో ఛాన్స్ లు రాకపోవడంతో కన్నడ సినిమా బెంగుళూరి డేస్ ని తమిళ్ లో బెంగుళూరు నాట్కల్ సినిమా తీశాడు. ఐతే ఆ రీమేక్ కూడా అతనికి సక్సెస్ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత ఐదేళ్లు ఆఫర్లు లేక ఖాళీగా ఉన్న భాస్కర్ కి అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా కాస్త బెటర్ అనిపించింది.
కమర్షియల్ గా ఓ సూపర్ అనిపించకపోఇయినా సరే బొమ్మరిల్లు భాస్కర్ కి ఒక పుష్ ఇచ్చింది. ఐతే ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఛాన్స్ కోసం నాలుగేళ్లు వెయిట్ చేశాడు బొమ్మరిల్లు భాస్కర్. ఫైనల్ గా ఈ ఇయర్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమా తీసి మరో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. 2006 బొమ్మరిల్లు నుంచి 2025 జాక్ వరకు బొమ్మరిల్లు భాస్కర్ చేసింది కేవలం 7 సినిమాలే.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన చేసిన 7 సినిమాల్లో తొలి సినిమా ట్రెండ్ సెట్ చేయగా ఆ తర్వాత ఏ సినిమా ఆ రేంజ్ అందుకోలేదు.
జాక్ తో కంబ్యాక్ ఇస్తాడని..
జాక్ తో కంబ్యాక్ ఇస్తాడని అనుకున్న భాస్కర్ మళ్లీ షాక్ తిన్నాడు. సిద్ధు లాంటి హీరోతో అతను చేసిన ఈ ప్రయత్నం మిస్ ఫైర్ అవ్వడంతో మరో హీరో ఛాన్స్ ఇస్తాడని చెప్పడం కష్టం అనిపించేలా ఉంది. మరి బొమ్మరి భాస్కర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ అతన్ని బొమ్మరిల్లు టైం లో ఇష్టపడిన ఆడియన్స్ ఈ డైరెక్టర్ మళ్లీ అలాంటి సినిమా ఎప్పుడు తీస్తాడని అనుకుంటున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ బ్యాచిలర్ సినిమాలానే యువ హీరోలతో తన రైటింగ్స్ తో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మళ్లీ అతను సరైన ట్రాక్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.