ఆ విషయంలో సౌత్‌ సినిమాలు చాలా ఉత్తమం..!

భాష ఏదైనా కమర్షియల్‌ సినిమా అంటే కాస్త రొమాంటిక్ టచ్‌, యాక్షన్‌ టచ్‌, కామెడీ యాంగిల్ ఉండాల్సిందే.;

Update: 2025-11-04 07:30 GMT

భాష ఏదైనా కమర్షియల్‌ సినిమా అంటే కాస్త రొమాంటిక్ టచ్‌, యాక్షన్‌ టచ్‌, కామెడీ యాంగిల్ ఉండాల్సిందే. అయితే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పేరుతో అందులో ఏ ఒక్క దాన్ని బలవంతంగా చొప్పించినా, కథలో అవసరం లేకున్నా కమర్షియల్‌ మూవీ కనుక ఇది ఉండాల్సిందే అని సీన్స్ క్రియేట్‌ చేసిన మొదటికే మోసం వస్తుంది అనే విషయం చాలా సార్లు నిరూపితం అయింది. అయినా కూడా ఫిల్మ్‌ మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని తెలుసుకోవడం లేదు. అవసం లేకుండా దేన్ని స్క్రీన్‌ ప్లే లో పెట్టకూడదు, ఏదైనా అతిగా ఉండకూడదు అనే విషయం ఫిల్మ్‌ మేకర్స్ ఇంకా కూడా వంట పట్టించుకున్నట్లుగా అనిపించడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ సినిమా కథ ఏది అయినా, నేపథ్యం ఏది అయినా కూడా ఒక రొమాంటిక్ ఐటెం సాంగ్‌ను పెట్టి రచ్చ చేస్తున్నారు, కమర్షియల్‌ హంగులు అంటూ అద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

బాలీవుడ్‌ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌...

హిందీ సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్స్‌ పేరుతో శృంగార పాటలు కనిపిస్తున్నాయి. వాటి పరిధి చాలా దూరం వెళ్ళింది. అసభ్యంగా ఉన్నాయి అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నప్పటికీ ఫిల్మ్‌ మేకర్స్ వాటినే కొనసాగిస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో సినిమాకు ప్రచారం కోసమే హీరోయిన్‌ను అందంగా చూపించడం, అశ్లీల డాన్స్‌లు చేయించడం, పొట్టి బట్టలు, రెయిన్‌ డాన్స్‌లు చేయించడం చేస్తున్నారు. ఇటీవల కాలంలో అలాంటి పాటలతో వచ్చిన కొన్ని సినిమాలు విడుదలకు ముందు బజ్‌ క్రియేట్‌ చేసినా విడుదల తర్వాత డిజాస్టర్ టాక్‌ ను దక్కించుకున్నాయి. సినిమాకు ప్రచారం తెచ్చి పెట్టే ఆ కమర్షియల్‌ పాటలు సినిమాలో చాలా ఎబెట్టుగా ఉంటున్నాయి అనే విషయాన్ని ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు. అందుకే సినిమా విడుదల తర్వాత మొత్తం ఫలితాన్ని ఆ పాటలు ప్రభావితం చేస్తున్నాయని రివ్యూలు వస్తున్నాయి.

టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాల్లో...

బాలీవుడ్‌ సినిమాలతో పోల్చితే సౌత్‌ సినిమాల్లో అలాంటి అశ్లీల పాటలు తక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలతో పోల్చితే టాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో డీసెంట్‌ కంటెంట్‌, ఐటెం సాంగ్స్ ఉంటాయి అనడంలో సందేహం లేదు. హిందీ సినిమాల్లోని ఐటెం సాంగ్స్ గత దశాబ్ద కాలంగా హద్దులు దాటి పోయాయి. హీరోయిన్‌ శరీరాన్ని చూపించడంతో పాటు, లిరిక్స్ విషయంలోనూ అసభ్యకరంగా ఉంటున్నాయి. ఇలాంటి సాహిత్యం ఏంట్రా బాబోయ్‌ అంటూ చాలా మంది అసహించుకుంటున్నారు. అయినా కూడా హిందీ ఫిల్మ్‌ మేకర్స్ లో మార్పు కనిపించడం లేదు. అలాంటి ఐటెం సాంగ్స్ లేని సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయినా కూడా ఫిల్మ్‌ మేకర్స్‌ లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అంటూ సినీ విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఐటెం సాంగ్స్ వల్ల సినిమా హిట్‌ అవుతుందా?

తెలుగు, తమిళ సినిమాల్లో ఒక మోస్తరు రొమాంటిక్‌ ఐటెం సాంగ్స్‌ను మాత్రమే చూస్తూ ఉంటాం. హీరోయిన్స్‌ను మరీ బొమ్మల మాదిరిగా చూపించకుండా సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ గౌరవిస్తూ వస్తున్నారు. కానీ హిందీ ఫిల్మ్‌ మేకర్స్‌ మాత్రం కొందరు హీరోయిన్స్‌ను మినహా ఇతర హీరోయిన్స్ అందరినీ గ్లామర్‌ డాల్స్‌గా చూపించేందుకు ఎక్కువ శ్రద్ద చూపిస్తూ ఉన్నారు. కథల విషయంలోనూ చాలా వైవిధ్యభరిత కథలను సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం రెండు మూడు జోనర్‌లకు ఫిక్స్ అయ్యి అందులోనే సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ రెండు మూడు జోనర్‌ సినిమాల్లోనూ అశ్లీల ఐటెం సాంగ్స్ వేస్తూనే ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో కంటే సౌత్‌ ఇండియన్‌ సినిమాలకు ఎక్కువ సక్సెస్ రేటు ఉంటుంది. అశ్లీల పాటలు ఉన్నంత మాత్రాన సినిమాలు హిట్‌ కావని బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News