'డాన్ 3' సస్పెన్స్ నడుమ ఫర్హాన్‌కి రణ్‌వీర్ పంపిన సందేశం!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `డాన్ 3` ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే ప్రశ్నకు సమాధానం దొరకడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `డాన్ 3` ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే ప్రశ్నకు సమాధానం దొరకడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగం కోసం కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ - దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ మధ్య కథా పరంగా ఒకే విధమైన అవగాహన కుదరలేదు. దాంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో.. అంతర్జాతీయ క్రైమ్ లార్డ్ `డాన్` పాత్ర అనూహ్యంగా రణ్‌వీర్ సింగ్ చేతుల్లోకి వెళ్ళింది. అయితే వరుసగా మూడు కమర్షియల్ ప్లాపులతో రణ్‌వీర్ సింగ్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో ఈ క్రేజీ ఆఫర్ అతడికి దక్కడం గమనార్హం. కానీ ఆ తర్వాత వచ్చిన `ధురంధర్` చిత్రం రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ గేమ్‌ను పూర్తిగా మార్చేసింది.
మరోవైపు షారూఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న తర్వాత చెలరేగిన వివాదాల నేపథ్యంలో.. రణ్‌వీర్ సింగ్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు ఒక ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చినట్లు ఏబీపీ కథనం వెల్లడించింది. ఫర్హాన్, రణ్‌వీర్ ఇద్దరికీ నచ్చిన మరో భిన్నమైన కథతో సినిమా చేద్దామని రణ్‌వీర్ ప్రతిపాదించాడు. దాంతో పాటు గతంలో తనతో గల్లీ బాయ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన ఫర్హాన్ సోదరి జోయా అఖ్తర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి రణ్‌వీర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఈ ప్రతిపాదనను ఫర్హాన్ అఖ్తర్ అతడి నిర్మాణ భాగస్వామి రితేష్ సిధ్వానీలు వెనువెంటనే సున్నితంగా తిరస్కరించినట్లు సదరు కథనం పేర్కొంది.
అయితే డాన్ 3 కోసం ఒప్పుకున్న రణ్ వీర్ సింగ్ `దురంధర్` ఫ్రాంఛైజీ గ్రాండ్ విక్టరీ తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ఫర్హాన్ బృందానికి మింగుడుపడలేదు. అప్పటికే 45 కోట్లు ఖర్చు చేసి ప్రీప్రొడక్షన్ పూర్తి చేసుకుని మరో ఐదురోజుల్లో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా రణ్ వీర్ తీసుకున్న నిర్ణయం వారికి షాకింగ్ గా మారినట్టు మీడియాకు చెప్పారు. అందుకే తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా బాలీవుడ్ అసోసియేషన్లకు ఫిర్యాదు చేసారు ఫర్హాన్. ఇటీవల రణ్ వీర్ ని ఎఫ్.డబ్ల్యూ.ఐ.సి.ఇ బాలీవుడ్ నుంచి నిషేధించగా ప్రస్తుతం అతడు నటించే తదుపరి చిత్రాలపైనా సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇలాంటి పరిణామాల మధ్య బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇటీవల హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో హల్‌చల్ చేశాడు. అక్కడ ఆర్సెనల్.. ఇంగ్లాండ్ ఫుట్ బాల్ టీమ్‌కు చెందిన ప్రముఖ మిడ్‌ఫీల్డర్ డిక్లాన్ రైస్ ను రణ్‌వీర్ కలిశాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఒక అద్భుతమైన ఫోటోను రణ్‌వీర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో ఎంతో కాన్ఫిడెంట్ గా చిరునవ్వుతో కనిపించిన ఈ ఫోటోను అభిమానులు ``సూపర్‌స్టార్ మీట్స్ సూపర్‌స్టార్`` మూమెంట్‌గా అభివర్ణిస్తున్నారు. డిక్లాన్ రైస్ ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసిస్తుంటే.. రణ్‌వీర్ భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత జనాదరణ పొందిన నటుడిగా కొనసాగుతున్నాడు.
ఈ ఇద్దరు ప్రముఖుల కలయిక ప్రస్తుతం వారి కెరీర్‌లో అత్యంత కీలకమైన సమయంలో కుదిరింది. ఆర్సెనల్ క్లబ్ ప్రీమియర్ లీగ్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడంలో డిక్లాన్ రైస్ అత్యంత కీలక పాత్ర పోషించి ప్రపంచ ఫుట్‌బాల్ ఆటలో అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రేజీ పిక్చర్‌పై నెటిజన్లు ఆన్‌లైన్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తూ `ఇద్దరు విజేతల కలయిక` అని కొనియాడుతున్నారు. ఒకరు ఫుట్‌బాల్ ప్రపంచంలో అతిపెద్ద వేదికను గెలుచుకుంటే.. మరొకరు బాలీవుడ్‌లో స్టార్‌డమ్ అనే పదానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ తమ తమ రంగాలలో శిఖరాగ్రానికి దూసుకుపోతున్నారు.
రణ్‌వీర్ సింగ్ విషయానికి వస్తే.. ఈ ఫోటో వైరల్ అయిన సమయం అతని కెరీర్ గ్రాఫ్ కు ఎంతో సరిగ్గా సరిపోయింది. తన తాజా చిత్రం `ధురంధర్`తో బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక రికార్డులను సృష్టించిన రణ్‌వీర్.. తన జనరేషన్‌లోనే మోస్ట్ బ్యాంకబుల్ స్టార్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. అంతేకాకుండా హిందీ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రూ.1000-కోట్ల హిందీ నెట్ క్లబ్ లో భాగమైన ఏకైక భారతీయ నటుడిగా రణ్‌వీర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత అతడి అసాధారణమైన బాక్సాఫీస్ జర్నీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.