బాలీవుడ్ ను వెంటాడుతున్న గుండెపోటు..మొన్న షెఫాలీ.. నేడు వరీందర్.. అదే కారణమా?

అయితే ఈ విషయం నుంచి ఇంకా బయటపడకుండానే ఈరోజు మరొక స్టార్ నటుడు గుండెపోటుకు గురయ్యి, మరణించారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ బాడీ బిల్డర్, స్టార్ నటుడు వీరేందర్ సింగ్ ఘుమాన్.;

Update: 2025-10-10 09:05 GMT

గుండెపోటు.. ఒకప్పుడు కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ కాలం మారుతున్న కొద్దీ ఎనిమిది సంవత్సరాల పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారన్న వార్తలు అందరినీ కలచి వేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. కాబట్టి ఏ మారుమూల ప్రదేశంలో ఏ చిన్న విషయం జరిగినా ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ గుండెపోటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే సామాన్యుల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ లో సెలబ్రిటీలు ఎక్కువగా గుండెపోటు బారినబడి మరణిస్తున్నారు అనే వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు బాలీవుడ్ నే ఈ గుండెపోటు ఎందుకు టార్గెట్ చేస్తోంది అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

విషయంలోకి వెళ్తే మొన్నటికి మొన్న "కాంటాలగా" ఫేమ్ షెఫాలీ జరీవాలా ఈ ఏడాది జూన్ 27న 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించింది. ఈమె మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా ఈమె భర్త ఇప్పటికీ ఈమెను మర్చిపోలేక.. ఈమె వాడి వదిలిన దుస్తులను ఉతకకుండానే.. కప్పుకొని పడుకుంటున్నాను అంటూ తన బాధను వెల్లడించాడు.

అయితే ఈ విషయం నుంచి ఇంకా బయటపడకుండానే ఈరోజు మరొక స్టార్ నటుడు గుండెపోటుకు గురయ్యి, మరణించారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ బాడీ బిల్డర్, స్టార్ నటుడు వీరేందర్ సింగ్ ఘుమాన్. ఈయన కూడా 42 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో మరణించారు. ఈయన బాడీ బిల్డర్ గా, నటుడుగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

ఇలా బాలీవుడ్ చెందిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ ఒకరి తర్వాత ఒకరు గుండెపోటు బారిన పడి మరణిస్తుండడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. బాలీవుడ్ నే ఈ గుండెపోటు టార్గెట్ చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా గుండెపోటు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని.. సెలబ్రిటీలకు మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అందంగా ఉండడానికి , ఫిట్నెస్ మైంటైన్ చేయడం కోసం నిత్యం జిమ్ సెంటర్లలో గడపడం.. ఎక్సర్సైజుల పేరిట శక్తికి మించిన బరువులు మోయడం, అటు సినిమా షూటింగ్ సెట్లో ఒత్తిడి, ఇటు వ్యక్తిగత జీవితం ఇలా ఎన్నో కారణాలు వారిని మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయట. క్రమంగా ఒత్తిడి పెరిగిపోయి ఇలా గుండెపోటుకు గురవుతున్నారని సమాచారం. ఏదేమైనా ఇప్పటికైనా సెలబ్రిటీలు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అభిమానులు సలహాలు ఇస్తున్నారు.

Tags:    

Similar News