ఆలియా లుక్ సంథింగ్ స్పెషల్
ఆలియా స్టార్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లలో తన ఇమేజ్‌ని అమాంతం పెంచిందని చెప్పాలి.;
ఆలియాభట్ నేటి జెన్ జెడ్ లో స్ఫూర్తివంతమైన నటి. కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ గా తనను తాను ఆవిష్కరించుకున్న మేటి కథానాయిక. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది.
ఆలియా స్టార్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లలో తన ఇమేజ్‌ని అమాంతం పెంచిందని చెప్పాలి. ప్రఖ్యాత గూచీ బ్రాండ్ ఆలియాను అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు. గూచీ ఇప్పుడు ది టైగర్ పేరుతో కొత్త కలెక్షన్స్ ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. సమ్మర్ 2026 కలెక్షన్‌ను ఆవిష్కరణకు ముందు ఆలియా మునుపటి స్పెషల్ లుక్ ని రివీల్ చేసింది. ఇది మిలన్ ఫ్యాషన్ వీక్ 2025లో అద్భుతంగా కనిపించిన లేస్ అండ్ శాటిన్ స్లిప్ డ్రెస్ ..లాంగ్ కోట్ లుక్. ఆలియా గ్లోబల్ స్టైల్ ఐకాన్‌గా ఎందుకు రాజ్యమేలుతోందో ఈ ఫోటోగ్రాఫ్ అర్థమయ్యేలా చెబుతోంది.
ఆలియా భట్ బ్లాక్-ఫర్రీ లుక్ ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండ్స్‌లోకి దూసుకెళ్లింది. అలాగే ఆలియా అంతర్జాతీయ పాప్ స్టార్లతో కలిసి ఉన్న ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గూచీ బ్రాండ్ ప్రచార కార్యక్రమంలో ఇతర తారలు డెమి మూర్, గ్వినేత్ పాల్ట్రో, సెరెనా విలియమ్స్ ,కెండాల్ జెన్నర్ తదితరులు ఉన్నారు.
`గంగూభాయి కథియావాడి`లో వేశ్య పాత్రలో నటించిన ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలోని లవ్ అండ్ వార్ లో నటిస్తోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.