వారసుడిని రంగంలోకి దించేస్తున్న సందీప్ విలన్!
ఇదిలా ఉంటే విలన్‌గా తన సత్తా చాటుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న బాబీ డియోల్ త్వరలో తన వారసుడిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారట.;
క్రేజీ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ రూపొందించిన వైల్డ్ ఎమోషనల్ డ్రామా 'యానిమల్'. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీలో అబ్రార్ హక్‌గా ఎలాంటి డైలాగ్స్‌లేని క్యారెక్టర్‌లో కేవలం తన అభినయంతో అదరగొట్టాడు బాబి డియోల్. వైల్డ్ క్యారెక్టర్‌లో కనిపించి తనలోని మరో యాంగిల్‌ని సినీ ప్రపంచానికి పరిచయం చేసి నటుడిగా సరికొత్త జర్నీకి శ్రీకారం చుట్టాడు.
ఈ మూవీలోని నటనకు గానూ బెస్ట్ విలన్‌గా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్ట్‌ని దక్కించుకున్న బాబీ డియోల్ ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లలో బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో 'ఆల్ఫా', తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు', తమిళంలో దళపతి విజయ్ నటిస్తున్న చివరి మూవీ 'జన నాయగన్'లో నటిస్తున్నాడు.
ఇవి త్వరలోనే విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే విలన్‌గా తన సత్తా చాటుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న బాబీ డియోల్ త్వరలో తన వారసుడిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి.బాబి డీయోల్ తనయుడు ఆర్యమన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జోరుగా జరుగుతున్నాయి.
తన వారసుడి అరంగేట్ర ఫిల్మ్‌ని బాబీ డియోల్ హోమ్ బ్యానర్‌లో నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన స్టోరీని ఫైనల్ చేసే పనిలో బాబి డియోల్ ఫుల్ బిజీగా మారిపోయారు. స్టోరీ ఫైనల్ అయ్యాక డైరెక్టర్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఫైనల్ చేస్తారట. వారసుడి ఎంట్రీకి సంబంధించిన మూవీ కాబట్టి డియోల్ ఫ్యామిలీ ఈ ప్రాజెక్ట్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బాలీవుడ్ టాక్.