• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 7 : యావర్...

బిగ్ బాస్ 7 : యావర్ వర్సెస్ గౌతం.. నెక్స్ట్ ఇమ్యునిటీ ఎవరికి..?

| బిగ్ బాస్ సీజన్ 7 లో శుక్రవారం ఎపిసోడ్ హాట్ హాట్ గానే సాగింది.

By - Tupaki Desk
Update: 2023-09-16 06:03 GMT

బిగ్ బాస్ సీజన్ 7 లో శుక్రవారం ఎపిసోడ్ హాట్ హాట్ గానే సాగింది. రెండో హౌస్ మెట్ ఇంకా రెండో పవర్ అస్త్ర దానితో పాటు నాలుగు వారాల ఇమ్యూని పొందేందుకు రెండు రోజుల నుంచి కంటెస్టెంట్స్ ని రెండు టీంలుగా విడగొట్టి మాయాస్త్ర టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రణధీర, మహాబలి టీంలుగా వారిని విడగొట్టి టాస్క్ లు ఇచ్చాడు. ఆ టాస్క్ లో రణధీర టీం గెలిచింది. దానితో రణధీర టీం నుంచి రెండో కంటెస్టెంట్ 4 వారాల ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశం వారికి దక్కింది.

రణధీర టీం లో ఆరుగురు కంటెస్టంట్స్ శివాజి, అమర్ దీప్, శోభా శెట్టి, షకీలా, ప్రిన్స్ యావర్, ప్రియాంక ఉన్నారు. వారిలో ఎవరు రెండో హౌజ్ మెట్ గా నాలుగు వారాల ఇమ్యూనిటీ పొందే ఛాన్స్ అందుకునేందుకు మహాబలి టీం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైం లోనే మహాబలి టీం లోని రతిక తన టీం మేట్స్ తో గొడవ పెట్టుకుంది. చివరగా మహాబలి టీం కు సంబంధించిన గౌతం యావర్ దగ్గర ఉన్న మాయాస్త్ర భాగాన్ని శివాజికి ఇచ్చాడు.

దానితో యావర్ గౌతం ల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు చాలా సేపు మాటలతో పోట్లాడుకున్నారు. తనకు ఇమ్యూనిటీ రాకుండా చేస్తున్నందుకు యావర్ ఎమోషనల్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ కన్ ఫెషన్ రూం లోకి పిలిచి అతన్ని కూల్ అయ్యేలా చేశాడు. ఇక యావర్ ఎగ్జిట్ అవడంతో శివాజి, షకీలా ఇద్దరు రెండో కంటెస్టెంట్, 4 వారాల ఇమ్యూనిటీ టాస్క్ చేస్తారు. అయితే మొదటి హౌస్ మెట్ గా పవర్ అస్త్రా ఉన్న సందీప్ కి బిగ్ బాస్ మిగిలిన వారిలో ఒకరిని రెండో హౌస్ మెట్ పోటీకి ఎంపిక చేయమని అడుగుతాడు.

ఆ టైం లో సందీప్ అమర్ దీప్ ని సెలెక్ట్ చేస్తాడు. సో రెండో హౌస్ మెట్ గా 4 వారాల ఇమ్యూనిటీ పొంది పవర్ అస్త్ర పొందేందుకు శివాజి, షకీలా, అమర్ దీప్ పోటీలో ఉండనున్నారు. వారికి ఇచ్చిన గట్టిగా బిగ్ బాస్ అని అరవడం టాస్క్ వారు పూర్తి చేశారు. రిజల్ట్ ఏంటి అన్నది ఈరోజు నాగార్జున ఎపిసోడ్ లో అనౌన్స్ చేస్తారని బిగ్ బాస్ చెప్పాడు.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ఉల్టా పుల్టా అంటూ బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవనున్నారు. రెండో హౌస్ మెట్ గా ఎవరికి ఛాన్స్ వస్తుంది. వీకెండ్ నాగార్జున ఈ వారం జరిగిన గొడవల గురించి కంటెస్టెంట్స్ ప్రవర్తన గురించి ఎలా క్లాస్ తీసుకుంటారన్నది చూడాలి.

Tags:    
  • Biggboss7 
  • Starmaa 
  • Nagarjuna 
  • Hotstar 
  • Tollywood 
  • Movienews 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS