బిగ్ బాస్ 9.. హౌజ్ లో రెండు గ్రూపులా..?

బిగ్ బాస్ సీజన్ 9 ని ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ 8 కి ఆశించిన స్థాయిలో టి.ఆర్.పి రాకపోవడం వల్ల సీజన్ 9 ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట.;

Update: 2025-08-21 08:30 GMT

బిగ్ బాస్ సీజన్ 9 ని ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ 8 కి ఆశించిన స్థాయిలో టి.ఆర్.పి రాకపోవడం వల్ల సీజన్ 9 ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 9 లో కామన్ మ్యాన్ కేటగిరిలో ఎక్కువమందిని తీసుకుంటున్నారని తెలిసిందే. ఐతే వారి కోసమే బిగ్ బాస్ షోకి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒకటి మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ షో షూటింగ్ పూర్తైంది. రేపటి నుంచి బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సెక్షన్ లో కామన్ మ్యాన్..

ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో హౌస్ ని కూడా రెండు సెక్షన్స్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ సీజన్ కి వెళ్లే సెలబ్రిటీస్ అంతా కూడా ఒక సెక్షన్ లో కామన్ మ్యాన్ అంతా కూడా మరో సెక్షన్ లో ఉండేలా కండీషన్స్ పెడుతున్నారట. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 9 లో కొందరు డైరెక్ట్ గా కామన్ మ్యాన్ కేటగిరిలో ఇప్పటికే బిగ్ బాస్ టీం ఎంపిక చేశారట. వారితో పాటు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన వాళ్లు.. ఎవరైతే జడ్జిలు అభిజిత్, నవదీప్, బిందు మాధవితో సెలెక్ట్ అవుతారో వాళ్లు కూడా కామన్ మ్యాన్ సెక్షన్ కి ఇచ్చిన హౌస్ లోకే వెళ్తారట.

అలా బిగ్ బాస్ 9 లో ఒకటే హౌస్ అయినా రెండు సెక్షన్స్ లో కంటెస్టెంట్స్ ని పెడుతున్నారట. ఐతే ఇది అంతా గేం ప్లాన్లో భామని తెలుస్తుంది. సీజన్ 9 లో టాస్కులు కూడా సంథింగ్ డిఫరెంట్ గా ఉండబోతాయని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 పై ఇప్పటికే ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాగార్జున హోం వర్క్..

బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ గా నాగార్జున కూడా ఈ సీజన్ కి హోం వర్క్ చేయాలని చూస్తున్నారు. ప్రతి సీజన్ లో నాగార్జున హోస్టింగ్ గురించి కూడా కొంత నెగిటివిటీ వస్తుంది. ఐతే ఈ సీజన్ లో దానికి ఛాన్స్ ఇవ్వకుండా షోని నాగార్జున కూడా కొంత ఫాలో అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉండబోతుందో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి మొదలు కాబోతుంది. ఈ సీజన్ లో 18 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తారని తెలుస్తుంది. 9 మంది సెలబ్రిటీస్ తో పాటు 9 మంది కామన్ మ్యాన్ కూడా అందులో ఉంటారట.

Tags:    

Similar News