ముకేశ్ కెప్టెన్సీ గోవిందా; కొత్త కెప్టెన్ గా అపూర్వ

మిథిలేష్ నిర్ణయానికి అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు మద్దతు ఇవ్వడంతో త్రిగుణ్ మరియు ముఖేష్‌లు వారిపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు.

Update: 2026-09-28 04:34 GMT

అగ్నిపరీక్ష కంటెస్టెంట్ మిథిలేష్ 15 లక్షల రూపాయల బ్రీఫ్‌కేస్‌ను తీసుకుని వెళ్లిపోవడం తో హౌజ్ మొత్తం లో ఒక అనిశ్చితి నెలకొంది. కొంత మంది మిథిలేష్ కి సపోర్ట్ చేయగా, ఇంకొంత మంది మాత్రం తప్పు పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అది విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి డిడక్ట్ చేయడం తో అది చాలా మంది కంటెస్టెంట్స్ కి నచ్చట్లేదు.

మిథిలేష్ నిర్ణయానికి అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు మద్దతు ఇవ్వడంతో త్రిగుణ్ మరియు ముఖేష్‌లు వారిపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. మూడో వారంలో త్రిగుణ్, అమన్‌ల మధ్య జరిగిన గొడవలు మిథిలేష్ ఎగ్జిట్ తర్వాత మరింత ముదిరాయి. అయితే ఇవి వచ్చే వారం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ త్రిగుణ్ కి అమన్ తో రోహిత్ తో గొడవలు ఉన్నాయి. ఇదే కాకుండా అమన్ కి ముకేశ్ కి కూడా గొడవలు ముదరడంతో ఇది కచ్చితంగా పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు.

పైగా వర్షిణి, వంశీలను ఎలిమినేషన్ నుంచి కాపాడటం కోసం ముఖేష్ తన కెప్టెన్సీని వదులుకోవడానికి సిద్ధమయ్యాడు; అయితే ఈ నిర్ణయం రాబోయే నామినేషన్లలో విమర్శలకు దారి తీసే అవకాశముంది. ముఖేష్, వర్షిణి, సుధీర్‌లు ఒక బలమైన బంధంగా ఏర్పడుతూ... రోహిత్ గ్రూప్‌నకు మరియు త్రిగుణ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న కెప్టెన్సీ ని వదులుకున్నందుకు ముకేశ్ ని మిగిలిన వాళ్ళు కార్నర్ చేసే అవకాశం ఉంది.

అనూహ్యంగా ముకేశ్ ప్లేస్ లో అపూర్వ ని ఈ వారం కెప్టెన్గా నియమించారు బిగ్బాస్. నిజానికి ముకేశ్ తో కలిసి ఆమే కెప్టెన్సీ టాస్క్ గెలిచింది కాబట్టి, ఆమె కొత్త కెప్టెన్గా నియమితురాలైంది. ఇక ఈ వారం టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ థీమ్ అదిరి పోవడం తో, వచ్చే వరం కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వచ్చే వారపు థీమ్ "ఫుల్ డామినేషన్" కావడంతో, ఈ సమీకరణలన్నీ కలిసి హౌస్‌లో ఎలాంటి సరికొత్త రగడకు దారి తీస్తాయో వేచి చూడాలి!

Tags:    

Similar News