బిగ్ బాస్ 9.. ఫస్ట్ డే ఎలిమినేషన్ షాక్..!
బిగ్ బాస్ సీజన్ 9 సండే నుంచి మొదలవుతుంది. గ్రాండ్ గా మొదలు కాబోతున్న సీజన్ 9 ఆరంభం నుంచే షో మీద ఆసక్తి పెంచేలా చేస్తున్నారట;
బిగ్ బాస్ సీజన్ 9 సండే నుంచి మొదలవుతుంది. గ్రాండ్ గా మొదలు కాబోతున్న సీజన్ 9 ఆరంభం నుంచే షో మీద ఆసక్తి పెంచేలా చేస్తున్నారట బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ సీజన్ 9 రణరంగం అంటూ హోస్ట్ నాగార్జున ప్రోమోలో చెప్పినట్టుగానే ఈసారి ఆట నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా బిగ్ బాస్ 9 లో సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ పోటీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందట. ఐతే సీజన్ 9 ఈసారి చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. అందులో భాగంగానే సీజన్ 9 మొదలైన మొదటి రోజే మొదటి ఎలిమినేషన్ కూడా ఉంటుందట.
ఆ రూల్ బ్రేక్ చేయబోతున్నారట..
అదేంటి ఎప్పుడైనా బిగ్ బాస్ లో వారం తర్వాత నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వస్తారు కదా అంటే.. ఈ సీజన్ లో ఆ రూల్ బ్రేక్ చేయబోతున్నారట. బిగ్ బాస్ సీజన్ 9 మొదటి రోజే ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారట. అదేదో ఎప్పటిలా కామెడీ ఎలిమినేషన్ కాదు సీరియస్ గానే ఆ కంటెస్టెంట్ ని హౌస్ నుంచి బయటకు పంపిస్తారట. ఏ కారణాలతో పంపిస్తారు.. ఎలా ఎలిమినేట్ చేస్తారు అన్నది షోలోనే చూడాలి.
ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనే కంటెస్టెంట్ లిస్ట్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ సీజన్ ని 14 లేదా 15 మంది కంటెస్టెంట్స్ తో మొదలు పెట్టబోతున్నారట. ఈ సీజన్ 9 లో ఈసారి రెండు హౌస్ లు ఉంటాయట. సెలబ్రిటీస్, కామన్ మ్యాన్ సెపరేట్ చేసి ఆట ఆడిస్తాడట బిగ్ బాస్. ఐతే షో లో రోజుకొక ట్విస్ట్.. పూటకో టాస్క్ తో బిగ్ బాస్ ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
సీజన్ 9 మొదటి ఎపిసోడ్..
బిగ్ బాస్ సీజన్ 9 ఆరంభం నుంచే అదరగొట్టేలా షో ప్లానింగ్ ఉండబోతుందని తెలుస్తుంది. గ్రాండ్ ఎపిసోడ్ గా సీజన్ 9 మొదటి ఎపిసోడ్ ఉండబోతుంది. స్టార్ హీరోయిన్స్ ఆట పాటలతో సీజన్ 9 ని ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ చేసేలా చూస్తున్నారు. మరి సీజన్ 9 షురూ అవుతున్న ఈ టైం లో కంటెస్టెంట్స్ ఎలా తమ సత్తా చాటుతరన్నది చూడాలి. స్టార్ సెలబ్రిటీస్ తో పాటు బుల్లితెర కమెడియన్స్ ఇలా అందరినీ బ్యాలెన్స్ చేస్తూ కంటెస్టెంట్స్ ఎంపిక జరిగిందని తెలుస్తుంది.
సో ఆదివారం అంటే సెప్టెంబర్ 7 నుంచి బుల్లితెర ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ మా లో ప్రతిరోజు నైట్ 9:30 నుంచి 10:30 నిమిషాల వరకు వస్తుంది. ఐతే సీజన్ 9 స్టార్టింగ్ ఎపిసోడ్ ఆదివారం 7 గంటల నుంచి మొదలు కాబోతుంది.