మాధురి గుంజీలు తీసింది.. ఇమ్మాన్యుయెల్ భలే ఇరుక్కున్నాడు..!
బిగ్ బాస్ సీజన్ 9లో దువ్వాడ మాధురి తన మార్క్ చూపిస్తుంది. హౌస్ లో తన ఫైర్ చూపిస్తున్న మాధురి ఆటలో కన్నా మిగతా విషయాల్లో కంటెస్టెంట్స్ ని ఎటాక్ చేస్తుంది.;
బిగ్ బాస్ సీజన్ 9లో దువ్వాడ మాధురి తన మార్క్ చూపిస్తుంది. హౌస్ లో తన ఫైర్ చూపిస్తున్న మాధురి ఆటలో కన్నా మిగతా విషయాల్లో కంటెస్టెంట్స్ ని ఎటాక్ చేస్తుంది. ఏదైనా విషయంలో మాధురితో వాదించడం అంటే బాబోయ్ అనేలా ఆమె హంగామా చేస్తుంది. ఐతే అలాంటి మాధురి చేత కెప్టెన్ గా ఉన్న ఇమ్మాన్యుయెల్ గుంజీలు తీయించడం విశేషం. మాధురి చేత గుంజీలా అదెలా సాధ్యమైంది అది కూడా ఇమ్మాన్యుయెల్ ఆమెను ఎలా కన్విన్స్ చేశాడు అంటే.. బిగ్ బాస్ హౌస్ లో మార్నింగ్ సాంగ్ తో అందరు నిద్రలేస్తారు. మధ్యలో ఎవరైనా కళ్లు మూసినట్టు అనిపించినా సరే కుక్క అరుపులతో సిగ్నల్స్ ఇస్తాడు.
కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ మాధురికి పనిష్మెంట్ గా 20 గుంజీలు..
శుక్రవారం ఎపిసోడ్ లో మాధురి మార్నింగ్ సాంగ్ తర్వాత బయట సోఫాలోనే అలా కళ్లు మూసుకుంది అంతే ఒక్కసారిగా కుక్క అరుపులు వినిపించాయి. వాష్ రూం ఏరియాలో ఉన్న కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ వచ్చి మాధురికి పనిష్మెంట్ గా 20 గుంజీలు తీయాలని అన్నాడు. కష్టమైనా సరే గుంజీలు తీయక తప్పలేదు మాధురికి.. ఇక మరోసారి వాష్ రూం ఏరియాలో కూడా మాధురి మళ్లీ కళ్లు మూసుకుని అలా సోఫాపై ఒరిగింది. మళ్లీ బిగ్ బాస్ కుక్క అరుపులను వినిపించాడు. మళ్లీ ఇమ్మాన్యుయెల్ వచ్చి ఇక్కడ పడుకున్నావా అని అడిగితే బాత్ రూం లో నుంచి బయటకు రావట్లేదు వెయిట్ చేస్తున్నా అన్నది.
అప్పుడు ఇమ్మాన్యుయెల్ మాధురికి రెండు మిర్చీలను తినాలని పనిష్మెంట్ ఇచ్చాడు. అలా హౌస్ లో తన నిద్రని కంట్రోల్ చేసుకుంటూ మాధురి కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ తో పనిష్మెంట్ లను కూడా తీసుకుంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మాధురి డేంజర్ జోన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ వారం ఎనిమిది మంది హౌస్ మెంట్స్ నామినేషన్స్ లో ఉండగా వారిలో మాధురి, సాయి, రాము ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వీకెండ్ ఎలిమినేట్ అవుతారు.
బాండింగ్ తో ఆటని ముందుకు తీసుకెళ్తుంటే..
బిగ్ బాస్ హౌస్ లో ఎవరి ఆట వారు ఆడుతున్నారు. కొందరు బాండింగ్ తో ఆటని ముందుకు తీసుకెళ్తుంటే మరికొందరు తమ ఆటతోనే ఆడియన్స్ మనసులు గెలవాలని చూస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో అందరు స్ట్రాంగ్ గానే ఉన్నారు. కొత్త కెప్టెన్ దివ్య తన రూల్ లో హౌస్ ని బాగా చూసుకోవాలని.. కంటెస్టెంట్స్ అందరికీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలని చూస్తుంది. శుక్రవారం ఎపిసోడ్ లో దియ కెప్టెన్ గా గెలిచింది కానీ తనూజ చివరి దాకా వచ్చి ఓడినందుకు చాలా అప్సెట్ అయ్యింది. ఇమ్మాన్యుయెల్ మొదటి రౌండ్ లో తనూజకి సపోర్ట్ చేసి గెలిచే రౌండ్ లో దివ్యా వైపు ఉన్నాడు.