బిగ్ బాస్ 9.. టాప్ 3కి పడిపోయిన ఇమ్మాన్యుయేల్..?

కళ్యాణ్ పడాల టాప్ 5 పక్కా టాప్ 5 కాదు టాప్ 3 లో అతనే ముందున్నాడు. ఇక మిగతా రెండు ప్లేస్ లో తనూజ, ఇమ్మాన్యుయెల్ ఉన్నారు.;

Update: 2025-12-01 04:25 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఆట మరో 3 వారాలు మాత్రమే ఉన్న టైం లో కంటెస్టెంట్స్ ఎవరికి వారు తమ గేమ్ ప్లాన్ తో దూసుకెళ్తున్నారు. ఐతే మొదటి నుంచి ఈ సీజన్ ని తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ వచ్చి టాప్ 3 లో కొనసాగుతూ వచ్చాడు ఇమ్మాన్యుయెల్. ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ లో కాస్త కూస్తో ఆడియన్స్ ని మెప్పించింది అంటే అది ఇమ్మాన్యుయెల్ వన్ మ్యాన్ షో వల్లే. ఐతే ఇమ్మాన్యుయెల్ దాదాపు టైటిల్ విన్నర్ అవుతాడని అందరు అనుకుంటున్న టైమ్ లో తనూజ అతనికి టఫ్ ఫైట్ ఇస్తూ వచ్చింది.

కామనర్ గా హౌస్ లోకి వచ్చిన కళ్యాణ్..

మొన్నటిదాకా ఈ సీజన్ విన్నర్ తనూజ, ఇమ్మాన్యుయెల్ మధ్యలోనే అనే టాక్ ఉండగా సడెన్ గా రేసులోకి ఆర్మీ మ్యాన్, కామనర్ గా హౌస్ లోకి వచ్చిన కళ్యాణ్ వచ్చాడు. లాస్ట్ కెప్టెన్ గా గెలవడం.. అతని సిన్సియారిటీ ఇవన్నీ అతనికి మంచి క్రేజ్ తెచ్చాయి. ఆల్రెడీ అతని పీ.ఆర్ టీం గట్టి ప్రమోషన్స్ చేస్తుండగా ఆడియన్స్ కూడా కళ్యాణ్ పడాల ఆట తీరుకి ఫిదా అవుతున్నారు.

కళ్యాణ్ పడాల టాప్ 5 పక్కా టాప్ 5 కాదు టాప్ 3 లో అతనే ముందున్నాడు. ఇక మిగతా రెండు ప్లేస్ లో తనూజ, ఇమ్మాన్యుయెల్ ఉన్నారు. ఐతే మొన్నటిదాకా ఇమ్మాన్యుయెల్ టాప్ 1 అనే టాక్ వినిపించగా ఇప్పుడు మారిన సమీకరణాలు చూస్తే టాప్ 3కి పడిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతీది కూడా కాలిక్యులేట్ చేస్తారు. ఇమ్మాన్యుయెల్ 3 సార్లు ఈ సీజన్ కెప్టెన్ అయినా కూడా లాస్ట్ వీక్ కెప్టెన్సీ కోసం డీమాన్ పవన్ తో వాదన నడిపించాడు.

ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్యలోనే ఈ సీజన్ విన్నర్..

సో అలా ఇమ్మాన్యుయెల్ కొన్నిసార్లు సాక్రిఫైజ్ కూడా మన ఆటకి ప్లస్ అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్యలోనే ఈ సీజన్ విన్నర్ ఉంటాడని మొన్నటిదాకా చర్చ ఉండగా ఇప్పుడు అది మారిపోయింది. కళ్యాణ్ రేసులో దూసుకొచ్చాడు. సో కళ్యాణ్ తర్వాత తనూజ, ఇమ్మాన్యుయెల్ ఉన్నారు. అంటే ఇమ్మాన్యుయెల్ తనకు తెలియకుండానే 3వ స్థానానికి పడిపోయాడు.

హౌస్ లో ఉన్న వాళ్లకి బయట పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలియదు కాబట్టి ఇమ్మాన్యుయెల్ తానే గెలిచేది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అతని ఆటని చెడగొడుతుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9లో టైటిల్ ఫైట్ లో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్ ఉన్నారు. సో ఈ వారం ఆట వీళ్లలో ఎవరిని టైటిల్ కి దగ్గర చేస్తుంది. ఎవరిని గ్రాఫ్ పడిపోయేలా చేస్తుంది అన్నది చూడాలి. ఐతే ముగ్గురు ఎక్కడ కూడా తమ ఆటని మర్చిపోకుండా గెలుపే లక్ష్యంగా ఆడుతున్నారు.

Tags:    

Similar News