బిగ్ బాస్ 9.. తనూజ ఇది మార్చుకోకపోతే మాత్రం..?

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం బీబీ రాజ్యం ఆట మొదలైంది. మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ రాజు, రాణులుగా కళ్యాణ్, దివ్య, రీతు లను ఎంపిక చేశాడు.;

Update: 2025-11-12 04:53 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం బీబీ రాజ్యం ఆట మొదలైంది. మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ రాజు, రాణులుగా కళ్యాణ్, దివ్య, రీతు లను ఎంపిక చేశాడు. వారితోనే నలుగురు కామండర్స్, నలుగురు ప్రజలను ఎంపిక చేయమని చెప్పాడు. తనూజ, డీమాన్ పవన్, నిఖిల్, సంజన కమాండర్స్ గా ఎంపిక చేయబడ్డారు ఇక మిగిలిన నలుగురు ఇమ్మాన్యుయెల్, భరణి, సుమన్ శెట్టి, గౌరవ్ రాజ్య ప్రజలుగా ఉన్నారు. ఇక కమాండర్స్ గా ఉన్న వారు కొనసాగాలంటే కొన్ని టాస్క్ లు ఆడాలి. మొదటి టాస్క్ లో బుట్టలో బాల్స్ వేయకుండా చూడాలి.

తనూజ సుమన్ శెట్టి కి సపోర్ట్..

ఈ టాస్క్ లో నలుగురు కమాండర్స్ తనూజ, డీమాన్ పవన్, సంజన, నిఖిల్ పాల్గొన్నారు. ఐతే తనూజ మొదట సేఫ్ అయ్యింది. ఈ టాస్క్ 3వ రౌండ్ లో నిఖిల్ గెలిచి సంజనని రిస్క్ లో పెట్టాడు. ఇక సంజన ప్రజల్లో ఒకరితో బిల్డింగ్ టాస్క్ ఆడాలని బిగ్ బాస్ చెప్పగా సుమన్ శెట్టిని ఎంపిక చేసుకుంటుంది. ఇచ్చిన బ్లాగ్స్ లో 6 పెట్టెలను సంజన, సుమన్ శెట్టి ఇద్దరు పెడతారు. ఐతే ఈ టాస్క్ లో తనూజ సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తుంది.

ఈ టాస్క్ కి సంచాలకులుగా ఉన్న కళ్యాణ్ సంజనాని గెలిపిస్తాడు. ఇద్దరు ఆరు బాక్స్ లను పెడతారు కానీ సుమన్ శెట్టి ముందు ఆరో బాక్స్ నిలబెడతాడు. ఆ ప్రకారం తనూజ అతనికి సపోర్ట్ చేస్తుంది. కానీ అతని బిల్డింగ్ కరెక్ట్ గా ఉండదు. సంజన బిల్డింగ్ కరెక్ట్ గా ఉంది. అందుకే కళ్యాణ్ సంజనని గెలిపిస్తాడు. ఈ డెసిషన్ టైం లో తనూజ కళ్యాణ్ మీద నీకు ఇష్టం వచ్చినట్టు రూల్స్ మార్చేస్తావా.. ముందు హైట్ మ్యాటర్ అన్నావ్ కదా అని వాదించింది.

నువ్వు రాంగ్ గా పోట్రే చేయాలని చూడకు..

నువ్వు సంచాలక్ అయితే ఏం చేస్తావ్ అని తనూజని అడుగుతాడు కళ్యాణ్ అప్పుడు ఆమె సుమన్ ని విన్ చేస్తా అంటే నేను అలా చేయను సంజనాని చేస్తానని చెబుతాడు. ఈ టాస్క్ డెసిషన్ టైం లో తనూజ కళ్యాణ్ తో వాదిస్తుంది. ఐతే కళ్యాణ్ నువ్వు రాంగ్ గా పోట్రే చేయాలని చూడకు అని అరుస్తాడు. ఫైనల్ గా సంజన టాస్క్ విన్ అయ్యి తన కమాండర్ షిప్ కాపాడుకుంటుంది. ఐతే టాస్క్ అయిన తర్వాత కళ్యాణ్ మళ్లీ పునరాలోచనలో పడతాడు.

తనూజ ప్రతి విషయంలో తను అనుకున్నదే జరగాలని చూస్తుంది. కరెక్ట్ అయినా మిస్టేక్ ఉన్నా అది సంచాలక్ డెసిషన్ కాబట్టి దానికి ఓకే చెప్పాల్సిందే కానీ దాన్ని వాధించడం వల్ల అనవసరమైన ఇష్యూ తప్ప మరోటి ఉండదు. మరి ఈ విషయంలో తనూజ కాస్త జాగ్రత్త పడాల్సిందే అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

Tags:    

Similar News