బిగ్ బాస్ 9.. ఆమె ఎలిమినేషన్ అతని ఆటపై ఎఫెక్ట్ పడుతుందా..?

బిగ్ బాస్ సీజన్ 9లో రీతు ఎలిమినేషన్ ఆమె ఫ్రెండ్ అయిన డీమాన్ పవన్ ని బాగా హర్ట్ అయ్యేలా చేసింది.;

Update: 2025-12-08 05:19 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో రీతూ చౌదరి ఎలిమినేషన్ ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. టాప్ 5 ఉంటుందని ఆమె గట్టిగా అనుకోగా ఆడియన్స్ ఆమెను బయటకు పంపించారు. ఈ సీజన్ లో రీతూ చౌదరి ఆట కన్నా డీమాన్ పవన్ తో చేసిన గొడవలే ఎక్కువ హాట్ టాపిక్ అయ్యాయి. రీతు, డీమాన్ ఇద్దరు 3వ వారం నుంచి క్లోజ్ అయ్యారు. ఐతే ఆడియన్స్ ఇదంతా కూడా ఆట కోసమే అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు. బయట పరిచయం ఉన్న ఇమ్మాన్యుయెల్ ని పక్కన పెట్టి డీమాన్ తో రీతు నడిపించిన ట్రాక్ ఏదైతే ఉందో అదంతా ఆమె కావాలని చేసిందని అనుకుంటున్నారు. అందుకే ఆమెకు టాప్ 5 అరహత ఇవ్వలేదు.

రీతూ వల్లే ఆటలో వెనకపడ్డ డీమాన్ పవన్..

బిగ్ బాస్ సీజన్ 9లో రీతు ఎలిమినేషన్ ఆమె ఫ్రెండ్ అయిన డీమాన్ పవన్ ని బాగా హర్ట్ అయ్యేలా చేసింది. డీమాన్ పవన్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఐతే ఇన్నాళ్లు రీతూ వల్లే డీమాన్ పవన్ ఆటలో వెనకపడ్డాడు అన్న టాక్ ఉంది. డీమాన్ పవన్ ఒక్కడిగా ఆడుతున్నా రేసులో రీతూ ఉంటే అతని మొదటి ప్రాధాన్యత ఆమె ఉంటుంది. అందుకే డీమాన్ పవన్ సోలో గేమ్ కి రీతూ అడ్డుగా ఉందని ఫిక్స్ అయ్యారు.

ఐతే ఇప్పుడు రీతూ హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. డీమాన్ పవన్ మిగిలిన ఈ వారం రోజులైనా తన ఆట ఆడితే బాగుంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. హౌస్ లోకి కామనర్ గా వచ్చిన డీమాన్ పవన్ తన ఆట తీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వచ్చాడు. ఐతే హౌస్ లో ఫిజికల్ గా స్ట్రాంగ్ అయిన డీమాన్ రీతూ వల్ల ఆటలో వెనకపడ్డాడు. ఇప్పుడు రీతూ ఎలిమినేట్ అయ్యింది కాబట్టి డీమాన్ పవన్ ఆటలో ముందుకెళ్తాడా తన సత్తా చాటుతాడా అన్నది చూడాలి.

టాప్ 5లో డీమాన్ పవన్ కూడా..

రీతూ కోసమే తన ఆట ఆడినా టాప్ 5లో డీమాన్ పవన్ కూడా ఉంటాడని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. ఐతే టాప్ 5లో చివరి స్థానంలో కాకుండా పైకి ఎగబాకాలి అంటే మాత్రం ఈ వారం రోజుల్లో ఆట అదరగొట్టాలి. బయట ఉన్న రీతూ కూడా ఏమైనా అతను గెలిచేందుకు సపోర్ట్ చేస్తే డీమాన్ విన్నర్ కాకపోయినా రన్నర్ గా అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 13 వారాల ఆటలో రీతూ కోసమే అన్నిసార్లు స్టాండ్ తీసుకున్న డీమాన్ పవన్ ఈ వారం తన ఆట తను ఆడితే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్. మరి డీమాన్ ఈ వీక్ పెర్ఫార్మెన్స్ తో ఎలా మెస్మరైజ్ చేస్తాడన్నది చూడాలి.

Tags:    

Similar News