బిగ్ బాస్ 9.. ఓనర్స్ అందరి టార్గెట్ ఆమె ఒక్కతే ఎందుకు..?

బిగ్ బాస్ సీజన్ 9 లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. మామూలుగా అయితే ప్రతిసారి మండే నుంచే నామినేషన్స్ స్టార్ట్ చేస్తారు కానీ ఈసారి మంగళవారం ఎపిసోడ్ తో నామినేషన్స్ మొదలు పెడుతున్నారు.;

Update: 2025-09-09 09:45 GMT

బిగ్ బాస్ సీజన్ 9 లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. మామూలుగా అయితే ప్రతిసారి మండే నుంచే నామినేషన్స్ స్టార్ట్ చేస్తారు కానీ ఈసారి మంగళవారం ఎపిసోడ్ తో నామినేషన్స్ మొదలు పెడుతున్నారు. ఇక ఈ నామినేషన్స్ కి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజైంది. ఈ ప్రోమో ప్రకారం కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అదే బిగ్ బాస్ లో ఓనర్స్ గా ఉన్న కామన్ మ్యాన్ గా వచ్చిన ఆరుగురు కలిసి ఒక టెనంట్ ని నామినేట్ చేయాలి. అది ఎవరు అన్నది వాళ్లంతా ఒక డెసిషన్ కి రావాలి.

ఓనర్స్ అంతా సంజన మీద ఎటాక్..

ఈ క్రమంలో ఓనర్స్ అంతా కూడా సంజన పేరు చెప్పారు. ఐతే తానే ఎందుకు అంటూ సంజన డౌట్ రేజ్ చేసింది. అందుకు మనీష్ మీరు ఆర్యుమెంట్ చేయడం వల్ల వేరే డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నాడు. ఇక మరోపక్క ప్రియ శెట్టి సంజన ని బ్యాక్ బిచ్చింగ్ అంటే.. ఆ మాట అనొద్దని ఆమె పై ఫైర్ అయ్యింది. మరోపక్క తన టెనంట్ సభ్యురాలైన ఫ్లోరా షైనీ కూడా సంజన మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. తన పర్సనల్ విషయాన్ని రెండు మూడుసార్లు అడిగావని సంజనని అన్నది.

ఇలా ఓనర్స్ మాత్రమే కాదు టెనంట్స్ నుంచి కూడా సంజన మీద ఎటాక్ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమోస్ ఈరోజు ఏం జరగబోతుందో శాంపిల్ చూపిస్తాడు. సీజన్ 9 మొదటి రోజు అంటే మండే కూడా ఓనర్స్, టెనంట్స్ మధ్య డిస్కషన్ జరిగింది. అందులో హరీష్, ఇమ్మాన్యుయెల్ మధ్య చిన్న పాటి ఇష్యూ నడిచింది. ఇమ్మాన్యుయెల్ సరదాగా హరీష్ ను గుండు అంకుల్ అనగానే అతను సీరియస్ అయ్యాడు. సారీ చెప్పినా కూడా హరీష్ ఇమ్మాన్యుయెల్ ని మాటలంటూనే ఉన్నాడు.

మొదటి వారం ఎవరు నామినేషన్స్ లో..

సో బిగ్ బాస్ సీజన్ 9 లో నామినేషన్స్ ఫైర్ మొదలైంది. మరి ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు. ఈ సీజన్ 9 లో మొదటి వారం ఎవరు నామినేషన్స్ లో ఉంటారు. ఎవరు ఈ వీకెండ్ హౌస్ కి గుడ్ బై చెబుతారన్నది చూడాలి. బిగ్ బాస్ హౌస్ లో ఎవరి స్ట్రాటజీలు వారివే. మండే జరిగిన హరీష్, ఇమ్మాన్యుయెల్ ఇష్యూలో కంటెస్టెంట్స్ ఒపీనియన్ ఏమో కానీ మేజర్ ఆడియన్స్ ఇమ్మాన్యుయెల్ కి సపోర్ట్ చేస్తుంటే కొంతమంది హరీష్ కి సపోర్ట్ గా ఉంటున్నారు. ఏది ఏమైనా సీజన్ 9 లో మాస్క్ మ్యాన్ హరీష్ తన మార్క్ చూపించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News