బిగ్ బాస్ లవ్ స్టోరీ.. వాళ్లిద్దరు క్లారిటీగా ఉన్నారు కానీ..!

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ప్రేమ జంటలు ఏర్పడటం కామన్. అది ఆట కోసమే అనిపించినా ఎలాంటి కమ్యూనికేషన్ మాధ్యమాలు లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఇంట్లో ఉంటే అభిప్రాయాలు కలిసో లేక కొన్ని విషయాల్లో బాగా అనిపించో ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది.;

Update: 2025-10-20 06:13 GMT

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ప్రేమ జంటలు ఏర్పడటం కామన్. అది ఆట కోసమే అనిపించినా ఎలాంటి కమ్యూనికేషన్ మాధ్యమాలు లేకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ఇంట్లో ఉంటే అభిప్రాయాలు కలిసో లేక కొన్ని విషయాల్లో బాగా అనిపించో ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. అది తర్వాత ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అన్నది చెప్పడం కష్టం.

రిలేషన్ లో రీతు క్లారిటీగానే ఉన్నా కూడా..

బిగ్ బాస్ సీజన్ 9లో కూడా అలాంటి ప్రేమ జంటలు ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. డీమాన్ పవన్, రీతు ఇద్దరు అయితే ఒకరి కోసమే ఒకరు అన్నట్టుగా కనిపిస్తున్నారు. వారి రిలేషన్ లో రీతు క్లారిటీగానే ఉన్నా కూడా డీమాన్ పవన్ మాత్రం కాస్త కన్ ఫ్యూజన్ తో కనిపిస్తున్నాడు.

ఇక మరోపక్క తనూజ, కళ్యాణ్ మధ్య జరుగుతున్న విషయాలు కూడా ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. కళ్యాణ్ కి తనూజ మీద లైకింగ్ ఉంది. అది అతను ఆమెకు చెప్పాడు. తనూజ కూడా కళ్యాణ్ ని ఒక మంచి ఫ్రెండ్ లా చూస్తుంది. ఆడియన్స్ కి కూడా ఆ విషయం అర్ధమైంది. కానీ వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన మాధురి, రమ్య మాత్రం వాళ్ల విషయంలో వీరిద్దరు గుసగుసలాడుతున్నారు.

కళ్యాణ్ తో తనకున్న బాండింగ్ పై తనూజా..

లాస్ట్ సాటర్డే తనూజాని నాగార్జున కన్ఫెషన్ రూం లోకి పిలిచి మాధురి, రమ్య ఏం మాట్లాడుతున్నారో చూపించారు. ఐతే ఆదివారం ఎపిసోడ్ లో తనూజ బిట్టర్ లడ్డూ ఇచ్చి కళ్యాణ్ తో తనకున్న బాండింగ్ తనకు అతనికి క్లారిటీ ఉంది. ఆడియన్స్ లో కూడా క్లారిటీ ఉంది. కానీ హౌస్ లో ఉన్న వాళ్లకే లేదని అన్నది. సో తనూజ కాస్త ఎమోషనల్ గా అనిపించినా కళ్యాణ్ విషయంలో పూర్తి తప్పు అతని మీద తోసేయకుండా చాలా బాగా చెప్పింది.

మొత్తానికి తనూజ, కళ్యాణ్ మధ్య ఏం జరుగుతుంది అన్నది ఎవరో మాట్లాడుకోవడం కాదు ఈ క్లారిటీతో తనూజకే ఆడియన్స్ నుంచి సపోర్ట్ వచ్చింది. అంతేకాదు ఇద్దరి మధ్య బాండింగ్ గురించి వారితో కాకుండా వెనకాల మాట్లాడటం కరెక్ట్ కాదని హౌస్ లో ఉన్న వారి గురించి కూడా తెలిసింది. మరి కళ్యాణ్ కి సపోర్ట్ గా తనూజా ఆట ఇలానే కొనసాగిస్తే ఇద్దరు మరికొన్ని వారాలు హౌస్ లో కొనసాగి టాప్ 5కి వెళ్లినా వెళ్లొచ్చని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరి ఆట వారు ఆడుతున్నారు. హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన ఆరుగురి ఎంట్రీ తర్వాత ఆట మరింత రసవత్తరంగా మారింది.

Tags:    

Similar News