బిగ్ బాస్ 9.. గౌరవ్ కి అన్యాయం.. కెప్టెన్ రేసులో ఉన్నది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ రేసు నుంచి గౌరవ్ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ లో కొన్ని సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్.;

Update: 2025-11-07 04:54 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ రేసు నుంచి గౌరవ్ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ లో కొన్ని సీక్రెట్ టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ముందు ఇద్దరు రెబల్స్ ని పెట్టి వారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చి వారు అది పూర్తి చేయగానే ఒక్కొక్కరిని కెప్టెన్సీ కంటెండర్ రేసు నుంచి తప్పించాలి. అలా సుమన్, దివ్యా ముందు కళ్యాణ్, ఆ తర్వాత నిఖిల్ చివరగా సాయి ని తప్పించారు. మధ్యలో బిగ్ బాస్ రెబల్ ఎవరని మీరు అనుకుంటున్నారో చెప్పండి అంటూ హౌస్ మెట్స్ ని అడిగితే అందరు డీమాన్ పవన్ అని చెప్పగా అతను ఈ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నాడు. మెజారిటీ పీపుల్ ఎవరు రెబల్ అని అంటారో అతను రెబల్ కాకపోయినా ఆట నుంచి తప్పుకోవాలి.

హౌస్ మేట్స్ అంతా స్ట్రాంగ్ కంటెండర్ ని టార్గెట్..

ఐతే ఇదే ఛాన్స్ అన్నట్టుగా హౌస్ మేట్స్ అంతా కూడా స్ట్రాంగ్ కంటెండర్ ని టార్గెట్ చేశారు. గురువారం ఎపిసోడ్ లో కూడా ముందు దివ్యా, సుమన్ ల రెబల్ ఆట ముగిసిందని చెప్పాడు బిగ్ బాస్. ఆ తర్వాత రీతుని రెబల్ గా నియమించాడు. ఆమె ఒకరితో గొడవ పడాలని టాస్క్ ఇవ్వగా ఆమె అలానే డీమాన్ పవన్ ని తీసేయడం గురించి ఇమ్మాన్యుయెల్ తో గొడవ పడింది. ఆ సీక్రెట్ టాస్క్ పూర్తి చేసినందుకు రీతుకి ఒకరిని ఆట నుంచి తొలగించే ఛాన్స్ రాగా శ్రీనివాస్ సాయిని తప్పించింది.

ఈమధ్యలో కెప్టెన్సీ కంటెండర్ ఆటలో భాగంగా ఒక వాటర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో మళ్లీ ఆరెంజ్ టీం అయిన ఇమ్మాన్యుయెల్, గౌరవ్ ఆడి గెలిచారు. అక్కడ గ్రీన్ సేఫ్ కార్డ్ ఎవరికి ఇవ్వాలన్న డిస్కషన్ నడిచింది. ఇమ్మాన్యుయెల్, గౌరవ్ నాక్కావాలంటే నాక్కావాలని వాధించుకున్నారు. ఫైనల్ గా ఇమ్మాన్యుయెల్ గౌరవ్ కి ఇవ్వమని ఆ డిస్కషన్ నుంచి వెళ్లిపోతాడు.

ఎక్కువ ఓట్స్ వచ్చిన వారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారు..

ఐతే రీతుకి ఇమ్మాన్యుయెల్ ఫ్యామిలీ ఫోటో దొంగిలించమని మరో సీక్రెట్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్ కానీ అది ఆమె చేయలేకపోతుంది. ఐతే మరోసారి బిగ్ బాస్ ఫైనల్ గా రెబల్ ఎవరని అడిగి.. ఎక్కువ ఓట్స్ వచ్చిన వారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారని చెప్పగా.. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ గౌరవ్ పేరు చెప్పారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆరెంజ్ టీం లో ఉన్న గౌరవ్ మీదే ఇమ్మాన్యుయెల్, తనూజ, రాము డౌట్ పడుతూ అతనే రెబల్ అని ఓటు వెశారు. సో అతను ఆట నుంచి తప్పుకున్నాడు.

ఓ విధంగా మొన్న డీమాన్ పవన్ కి ఎలాగైతే అన్యాయం జరిగిందో నిన్న కెప్టెన్సీ రేసు నుంచి గౌరవ్ ని తప్పించడం కూడా అతనికి కూడా అన్యాయమే అన్నట్టు చెప్పొచ్చు. అసలు రెబల్ అని డౌట్ లేకపోయినా ఎక్కువ ఓట్స్ వేసి అతన్ని ఆట నుంచి తప్పించడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆడియన్స్ భావిస్తున్నారు.

ఫైనల్ గా గౌరవ్ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోగా భరణి, రీతు, తనూజ, దివ్య, సుమన్, ఇమ్మాన్యుయెల్, రాము కెప్టెన్సీ రేసులో ఉన్నారు. భరణి, రాము, తనూజ, రీతు, ఇమ్మాన్యుయెల్ నుంచి నలుగురు మాత్రమే ఈ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ చెప్పగా రాము స్వయంగానే నేను తప్పుకుంటా అని చెప్పడంతో భరణి, ఇమ్మాన్యుయెల్, తనూజ, రీతు ఫైనల్ అయ్యారు వీరితో పాటు దివ్య, సుమన్ కూడా ఈ రేసులో ఉన్నారు.

Tags:    

Similar News