లీడర్ బోర్డ్ లో తనూజను వెనక్కి నెట్టిన డీమాన్ పవన్..!
బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ వీక్ కి వారం ముందు కంటెస్టెంట్స్ లెక్కలు మారుతున్నాయి. హౌస్ లో ఎవరికి వారు తమ ప్లాన్స్ వేసుకుంటూ తామే ముందుకు వెళ్లాలన్న ప్లానింగ్ తో వెళ్తున్నారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనల్ వీక్ కి వారం ముందు కంటెస్టెంట్స్ లెక్కలు మారుతున్నాయి. హౌస్ లో ఎవరికి వారు తమ ప్లాన్స్ వేసుకుంటూ తామే ముందుకు వెళ్లాలన్న ప్లానింగ్ తో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు టాప్ లో ఉన్న ఒకరిద్దరు కంటెస్టెంట్స్ కాస్త వెనకపడిన పరిస్థితి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ ఇప్పటివరకు టాప్ 3 లో ఉంటూ వచ్చింది. ఒకానొక దశలో ఆమే ఈ సీజన్ విన్నర్ అనే ఊపు వచ్చింది. ఆడియన్స్ లో తనూజని ఇష్టపడే వారు ఉన్నారు. ఆమె టాస్క్ ఆడే విధానం ఇంకా ఫైటింగ్ అంతా ఆడియన్స్ కి నచ్చేసింది.
అనూహ్యంగా నాలుగో స్థానానికి తనూజ..
ఐతే ఈ వారం హౌస్ లో లీడర్ బోర్డ్ పాయింట్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో అనూహ్యంగా తనూజ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆల్రెడీ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచిన కళ్యాణ్ ఈ టాస్క్ లు ఆడాల్సిన అవసరం లేకుండా అయ్యింది. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న మిగతా ఆరుగురు ఈ టాస్క్ లు ఆడుతున్నారు. ఐతే మంగళవారం టాస్క్ లో ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ మరోసారి తమ ఆటలో సత్తా చాటారు.
ఈ క్రమంలో తనూజ డీమాన్ పవన్ కన్నా చాలా ముందు ఉండగా ఈ టాస్క్ లో ఓడిపోయి లీడర్ బోర్డ్ లో అతని తర్వాత స్థానాన్ని సంపాదించుకుంది. సో లీడర్ బోర్డ్ లో టాప్ 2గా ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్ ఉన్నారు. వారిద్దరికి కూడా బయట నుంచి వచ్చిన ఆడియన్స్ తో డిస్కస్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆడియన్స్ ఇలా హౌస్ లోకి వెళ్లి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మాట్లాడటం కూడా ఈ సీజన్ లోనే జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 9లో ట్విస్టులు..
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ ట్విస్టులు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. సీజన్ 9లో తనూజ టాప్ 1 గా నిలుస్తుంది. దాదాపు టైటిల్ ఆమే గెలుస్తుందని ఆమె ఫ్యాన్స్ చెబుతుండగా లీడర్ బోర్డ్ టాస్క్ లో తనూజ డీమాన్ పవన్ తర్వాత స్థానం పొందడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఇలానే కొనసాగితే టాప్ 5లో కూడా డీమాన్ పవన్ తనూజ మధ్య గట్టి ఫైట్ ఏర్పడే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. తనూజ గ్రాఫ్ పడిపోవడంతో కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ మధ్యలోనే టైటిల్ విన్నర్ ఉంటారని చెప్పొచ్చు.
ఐతే నెక్స్ట్ వీక్ మొత్తం కంటెస్టెంట్స్ జర్నీలతోనే గడుస్తుంది. టాస్క్ లు లాంటివి ఏవి ఉండవు. వారి సత్తా చాటాలంటే ఈ వారం టాస్క్ లల్లోనే అదరగొట్టాలి. ఇక ఈ వారం కళ్యాణ్ తప్ప హౌస్ మేట్స్ అంతా నామినేట్ అవ్వగా వారిలో నుంచి సుమన్, సంజన ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది.