బిగ్ బాస్ 9.. ఈ ఎలిమినేషన్ ఊహించలేదుగా..?

ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఉంటారని డిస్కషన్ జరుగుతున్నా కూడా రీతు చౌదరి ఎలిమినేషన్ కొంత షాక్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు.;

Update: 2025-12-06 17:22 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ షాకింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఆదివారం టెలికాస్ట్ చేసే ఎపిసోడ్ ముందే షూట్ జరుగుతుంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ముందే లీక్ అవుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ పై రకరకాల ఊహాగానాలు రాగా ఫైనల్ గా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం హౌస్ లో ఉన్న వారిలో కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు.

డీమాన్ పవన్ తో రీతు..

నామినేషన్స్ లో భరణి, సుమన్, సంజన, రీతు, డీమాన్ పవన్, తనూజ ఉన్నారు. వీరిలో నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యింది రీతు చౌదరి అని తెలుస్తుంది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న రీతూ డీమాన్ పవన్ తో క్లోజ్ అయ్యింది. ఒక దశలో డీమాన్ పవన్ ఆట ఆమె చెడగొడుతుంది అన్న విధంగా పరిస్థితి మారింది. రీతు తన ఫోకస్ అంతా ఆట మీద ఉన్నా సంచాలక్ గా చేసిన కొన్ని తప్పుల వల్ల ఆమె ఆట మీద ఎఫెక్ట్ పడింది.

అంతేకాదు హౌస్ లో ఏదో ఒక టైం లో ప్రతి కంటెస్టెంట్ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. డీమాన్ పవన్ తో రీతు చేసే ఫ్రెండ్ షిప్ కూడా ఆట కోసమే అన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఆమె టైం ముగిసింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో లీస్ట్ ఓటింగ్ లో సంజన, రీతు చౌదరి ఉన్నారు. ఐతే వారిలో రీతు చౌదరికి తక్కువ ఓటింగ్స్ రాగా ఆమెను హౌస్ నుంచి ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది.

మిస్టేక్ తన వైపు ఉన్నా వాధించడం..

ఐతే సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి ఈ ముగ్గురిలోనే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఉంటారని డిస్కషన్ జరుగుతున్నా కూడా రీతు చౌదరి ఎలిమినేషన్ కొంత షాక్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. రీతు చౌదరి కూడా తన ఎలిమినేషన్ ని ఊహించి ఉండదు. టాస్క్ లల్లో తన బెస్ట్ ఎఫర్ట్ పెట్టిన రీతు ఆటలో కొంత కన్ ఫ్యూజ్ అవ్వడం ఏదైనా మిస్టేక్ తన వైపు ఉన్నా తనది తప్పు లేదని వాధించడం వల్ల ఆడియన్స్ లో కొంత నెగిటివిటీ వచ్చింది. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం రీతూ చౌదరి బిగ్ బాస్ ఇంటిని వదిలి తన సొంత ఇంటికి వెళ్తుంది.

Tags:    

Similar News