బిగ్ బాస్ 9.. చివరి కెప్టెన్సీ రేసులో నిలిచింది ఎవరు..?
బిగ్ బాస్ సీజన్ 9లో చివరి కెప్టెన్సీ ఫైట్ జరుగుతుంది. ముందుగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లను హౌస్ లో ఉన్న వారితో కాకుండా ఆల్రెడీ ముందు సీజన్లలో కెప్టెన్ గా నిలిచిన యోధులను బిగ్ బాస్ హౌస్ లో కి పంపించాడు.;
బిగ్ బాస్ సీజన్ 9లో చివరి కెప్టెన్సీ ఫైట్ జరుగుతుంది. ముందుగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లను హౌస్ లో ఉన్న వారితో కాకుండా ఆల్రెడీ ముందు సీజన్లలో కెప్టెన్ గా నిలిచిన యోధులను బిగ్ బాస్ హౌస్ లో కి పంపించాడు. అలా వచ్చిన ప్రియాంక, మానస్, హారిక, ప్రేరణ, శోభా శెట్టి, యావర్, సోహైల్ వచ్చి హౌస్ మేట్స్ ని పలకరించారు. వారితో ఆట ఆడి కొందరు గెలవగా మరికొందరు ఓడిపోయారు.
రీతు, సంజన ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ గా..
గురువారం ఎపిసోడ్ లో శోభా శెట్టి ముందు హౌస్ లోకి వచ్చింది. ఆమె తన అపోనెంట్ గా దివ్యని ఎంపిక చేసుకుని ట్రయాంగిల్ లో ఎటు చూసినా ఒకే సంఖ్య వచ్చేలా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో దివ్య గెలిచి కెప్టెన్ కంటెండర్ గా నిలిచింది. సీజన్ 7కి సంబందించిన యావర్ కూడా హౌస్ లోకి వచ్చాడు. అతనితో ఇమ్మాన్యుయెల్ టాస్క్ ఆడి గెలిచాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 3 అయిన సోహైల్ హౌస్ లోకి వచ్చాడు.
అతను హౌస్ లో సూపర్ ఎంటర్టైన్ చేశాడు. సోహైల్ తో చివరగా మిగిలిన రీతు, సంజన ఇద్దరు టాస్క్ ఆడారు. ఐతే ఆ టాస్క్ లో వారిద్దరు గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 9లో చివరి కెప్టెన్సీ కంటెండర్ రేసులో డీమాన్ పవన్, కళ్యాణ్, రీతు, సంజన, దివ్య, ఇమ్మాన్యుయెల్ నిలిచారు.
ఈ వారం కెప్టెన్ అయిన వారికి మాక్సిమం టాప్ 5 ఛాన్స్..
వీరిలో ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం కెప్టెన్ అయితే అతనికి నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీతో పాటు రేసులో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఈ వారం కెప్టెన్ అయిన వారికి మాక్సిమం టాప్ 5కి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అందుకే హౌస్ మేట్స్ అంతా కూడా ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు కష్టపడుతున్నారు.
బిగ్ బాస్ యోధులు అదే పాత కంటెస్టెంట్స్ వచ్చి ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు వీళ్లు అర్హులు అని వారితో టాస్క్ ఆడి గెలిచిన వారిని కెప్టెన్సీ అర్హత ఉందని ప్రూవ్ చేశారు. ఐతే ఈ ఆరుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భరణి ఓడినందుకు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మొదటి వారం నుంచి ఉన్న అతను ఒక్కడే కెప్టెన్ అవ్వలేదు మిగతా వారంతా ఒకటి రెండుసార్లు కూడా కెప్టెన్ అయ్యారు. సో ఈ టాస్క్ లో ఎవరు విన్ అయి కెప్టెన్ అవుతారన్నది చూడాలి.