బిగ్ బాస్ 9 బిగ్ ట్విస్ట్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
బిగ్ బాస్ సీజన్ 9లో ఎలిమినేషన్ ట్విస్ట్ ఈ వారం అటు హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా షాక్ అయ్యేలా చేస్తుందని తెలుస్తుంది.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఎలిమినేషన్ ట్విస్ట్ ఈ వారం అటు హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా షాక్ అయ్యేలా చేస్తుందని తెలుస్తుంది. సీజన్ 9 లో ఈ వారం ఏడుగురు హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. తనూజ, భరణి, సుమన్, సంజన, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్ నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే తనూజ హౌస్ లో అందరి కన్నా హైయ్యెస్ట్ ఓటింగ్ తో టాప్ 1 లో దూసుకెళ్తుంది. ఆమె తర్వాత స్థానంలో కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు ఉన్నాడు.
లీస్ట్ ఇద్దరిలో సాయి శ్రీనివాస్, రాము రాథోడ్..
నెక్స్ట్ సంజన, సుమన్ ఆ తర్వాత భరణి ఉన్నారు. ఇక లీస్ట్ ఇద్దరిలో సాయి శ్రీనివాస్ తో పాటుగా రాము రాథోడ్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే వీరిలో సాయి శ్రీనివాస్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాడని తెలుస్తుంది. దాదాపు అతనే ఈ వీక్ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడని టాక్. అతను ఒకవేళ కాకపోతే మాత్రం రాము ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు.
ఏది ఏమైనా ఈ ఇద్దరి మధ్యలోనే ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ దగ్గర గోల్డెన్ డైమండ్ ఉంది. అది వాడి ఎలిమినేట్ అయ్యే హౌస్ మేట్ ని కాపాడే ఛాన్స్ ఉంటుంది. ఐతే సాయి, రాములలో ఎవరి కోసం తనూజ ఆ డైమండ్ వాడుతుంది అన్నది తెలియాల్సి ఉంది. సాయి శ్రీనివాస్ ఐదో వారం వైల్డ్ కార్డ్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి నాలుగు వారాలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా తన మార్క్ చూపించలేకపోతున్నాడు.
ఆడియన్స్ లో ఎలాంటి ఒపీనియన్ లేదు..
అందుకే ఆడియన్స్ లో అతని మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. మరోపక్క రాము ఆల్రెడీ ముందు నుంచి హౌస్ లో ఉన్నాడు. అతను టాస్క్ లల్లో సరిగా ఆడకపోయిన అతని వల్ల హౌస్ అట్మాస్పియర్ అయితే ఎప్పుడు చెడిపోలేదు. ఐతే అతన్ని హౌస్ మేట్స్ కూడా చాలా లైట్ తీసుకున్నారా అన్న డౌట్ ఉన్నా కూడా రామునే వాళ్లకి ఆ ఛాన్స్ ఇచ్చాడని అర్ధమవుతుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా సర్ ప్రైజ్ అయ్యేలా చేస్తుందని అనిపిస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లో వారాలు గడుస్తున్నా కొద్దీ కూడా ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే హౌస్ లో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్న క్లారిటీ ఉంది. టాప్ 5లో ఆల్రెడీ ఇద్దరు దాదాపు కన్ఫర్మ్ కాగా మరో ముగ్గురు ఎవరన్నది ఆడియన్స్ డిసైడ్ చేయాల్సి ఉంది.