డ్రాగ‌న్ కోసం విదేశీ స్టంట్ మాస్ట‌ర్లు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Update: 2026-05-15 08:30 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేవర తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేతుల్లో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది.

మాస్ ఆడియన్స్‌లో ఎన్టీఆర్‌కు ఉన్న అద్భుతమైన ఫాలోయింగ్, భారీ యాక్షన్ సినిమాలను స్టైలిష్‌గా తెరకెక్కించే ప్రశాంత్ నీల్ మార్క్ కలిసి ఈ ప్రాజెక్టును నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తాయనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని వర్కింగ్ స్టిల్స్, లీకైన మేకోవర్ వివరాలు చూస్తే, ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నడూ చూడని విధంగా స్టైలిష్ మరియు స్లిమ్ అవతార్‌లో కనిపించడం ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది.

ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌ను పూర్తిగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు ప్రముఖ నటులు బిజూ మీన‌న్, ప్ర‌కాష్ రాజ్ పాల్గొననున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా రప్పిస్తున్న స్టంట్ ఫైటర్స్‌తో భారీ యాక్షన్ బ్లాక్స్ తెరకెక్కించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోందట. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఇప్పటికే కేజీఎఫ్, సలార్ సినిమాలు నిరూపించాయి. అదే తరహాలో ఈ సినిమాలో కూడా రా అండ్ రగ్గడ్ యాక్షన్‌తో పాటు భారీ విజువల్ స్కేల్ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం డిజైన్ చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తాయని సమాచారం.

ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైటిల్ పై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా ఈ టైటిల్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు హీరోయిన్‌గా రుక్మిణి వ‌సంత్ నటిస్తుండగా, సంగీతాన్ని ర‌వి బ‌స్రూర్ అందిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడని, ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.

Tags:    

Similar News