డైరెక్టర్ తేజ కొడుకుతో రొమాన్స్ కి సిద్ధమైన కృష్ణ మనవరాలు.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!

ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వారసుడు, వారసురాలి ఎంట్రీకి సర్వం సిద్ధం అవుతోంది. మరి వారెవరు? ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.;

Update: 2025-08-17 12:38 GMT

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ ఎప్పటినుంచో జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు తమ తదనంతరం తమ వారసులకు ఆ స్థానాన్ని కల్పించాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వారసుడు, వారసురాలి ఎంట్రీకి సర్వం సిద్ధం అవుతోంది. మరి వారెవరు? ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవరాలిగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది భారతి ఘట్టమనేని. ఇప్పటికే తన బాబాయ్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాటకు అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకున్న భారతీ ఘట్టమనేని.. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకల్లో కూడా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈమె ప్రముఖ డైరెక్టర్ తేజ కొడుకుతో సినిమా చేయడానికి సిద్ధం అయ్యింది.

అసలు విషయంలోకి వెళ్తే.. చిత్రం, జయం, నువ్వు నేను, సంబరం, ఔనన్నా కాదన్నా ఇలా ఎన్నో ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గాని నిలిచారు డైరెక్టర్ తేజ. తన సినిమాల ద్వారా నితిన్, ఉదయ్ కిరణ్ , కాజల్ అగర్వాల్, నవదీప్, ప్రిన్స్, నందిత ఇలా ఎంతోమంది హీరోలు, హీరోయిన్లను కూడా పరిచయం చేశారు. తేజ 2017లో చివరిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈయన.. మళ్లీ మరో సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు సరైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇతరులను నమ్ముకోకుండా.. ఏకంగా తన కుమారుడినే ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచన చేస్తున్నారు.

అందులో భాగంగానే తన దర్శకత్వంలోనే ఒక ప్రేమ కథతో తన కొడుకు అమితవ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.ఇకపోతే సుమారు రెండేళ్ల క్రితమే 'విక్రమాదిత్య' పేరుతో ఒక పీరియాడికల్ లవ్ స్టోరీని ప్రకటించారు తేజ. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అప్పట్లో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ఇప్పుడు తేజ తన కొడుకుని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఫైనల్ అయ్యారు కాబట్టి త్వరలోనే విక్రమాదిత్య మూవీని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇద్దరు వారసుల ఎంట్రీతో తేజ డైరెక్షన్లో మరోసారి రూపుదిద్దుకోబోతున్న ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News