• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భార‌తీయుడు 2: సేనాప‌తి...

భార‌తీయుడు 2: సేనాప‌తి క‌త్తిపోట్లకు సిద్ధం

| యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ - శంకర్ కాంబినేష‌న్ లో `భార‌తీయుడు 2` ఎట్ట‌కేల‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది.

By - Tupaki Desk
Update: 2024-04-14 11:48 GMT

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ - శంకర్ కాంబినేష‌న్ లో `భార‌తీయుడు 2` ఎట్ట‌కేల‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంత‌కంత‌కు ఆల‌స్య‌మైనా కానీ, ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పై అభిమానుల్లో చాలా ఉత్కంఠ నెల‌కొంది. దీనికి కార‌ణం శంక‌ర్ రాజీ లేని ప‌నిత‌నం.. ఎంపిక చేసుకునే కాన్వాస్ అన‌డంలో సందేహం లేదు.


ఈ సీక్వెల్ చిత్రంలోను కమల్ హాసన్ సేనాపతి గా అల‌రించ‌నున్నారు. అవినీతి నాయ‌కుల‌కు, అధికారుల‌కు క‌త్తి పోట్లు త‌ప్ప‌వ‌ని ఇప్ప‌టికే సేనాప‌తి నుంచి హెచ్చ‌రిక పోస్ట‌ర్లు జారీ అయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి సేనాప‌తి లుక్ కి సంబంధించిన‌ కొత్త పోస్ట‌ర్ ల‌ను శంక‌ర్ బృందం రిలీజ్ చేసారు. అవినీతికి వ్య‌తిరేకంగా సాగే యుద్ధంలో సేనాప‌తి క్రోధాన్ని ఈ పోస్ట‌ర్లు ఆవిష్క‌రించాయి. భార‌తీయుడి ఎటాక్ ఎలా ఉంటుందో చూడాల‌న్న ఉత్కంఠ అభిమానుల్లో అంత‌కంత‌కు పెంచేలా తాజాగా రిలీజ్ చేసిన కొత్త పోస్ట‌ర్లు ఆక‌ర్షిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.


ఇప్ప‌టికే భార‌తీయుడు 2 ప్ర‌మోష‌న్స్ లో టీమ్ వేగం పెంచడంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు టాకీ పూర్తి చేసి ఇంటెన్సివ్ గా పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేసేందుకు ద‌ర్శ‌కుడు శంక‌ర్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. జూన్‌లో భార‌తీయుడు 2 ని గ్లోబల్ విడుదలకు ప్లాన్ చేస్తుండ‌గా, మే చివరి నాటికి పవర్ ప్యాక్డ్ ట్రైలర్‌ను ఆవిష్కరించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. కమల్ హాసన్ సేనాపతిగా ఎలాంటి విన్యాసాల‌ను ఆవిష్క‌రిస్తారో చూడాల‌న్న ఉత్కంఠ అంద‌రికీ ఉంది.

జీరో టాలరెన్స్- అనే ట్యాగ్‌లైన్ కి త‌గ్గ‌ట్టే క్ష‌మాప‌ణ లేని సేనాప‌తిని చూడాల‌ని కోరుకుంటున్నారు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భవానీ శంకర్ ఇందులో క‌థానాయిక‌లు. ఈ చిత్రంలో SJ సూర్య, సిద్ధార్థ్, గుల్షన్ గ్రోవర్ వంటి టాప్ క్లాస్ స్టార్లు న‌టిస్తున్నారు.

అనిరుధ్ రవిచందర్ సంగీత నైపుణ్యం, రవి వర్మన్ ఆకర్షణీయమైన సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ నేర్పరిత‌నంతో కూడుకున్న‌ ఎడిటింగ్ ప్ర‌ధాన అస్సెట్ కానున్నాయి. బి. జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్ వంటి టాప్ క్లాస్ రచయితల సహకారం శంక‌ర్ టీమ్ కి ప్ర‌ధాన ఆయుధం. సుభాస్కరన్ అల్లిరాజాకు చెందిన‌ లైకా ప్రొడక్షన్స్ - రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతీయుడు 2 (ఇండియన్ 2) సినిమా సాంకేతికంగా కొత్త బెంచ్‌మార్క్‌ను తాకుతుంద‌ని అంచ‌నా. ఇండియన్ 2 ఒరిజినల్ తమిళ వెర్షన్ కాగా, తెలుగులో భారతీయుడు 2గా, హిందీలో హిందుస్తానీ 2గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

Tags:    
  • Bharateeyudu2 
  • Shankar 
  • Kamalhaasan 
  • Anirudh 
  • Lycaproductions 
  • Panindiaprojects 
  • Moviestills 
  • Kajal 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS