గ్లామ‌ర్‌లోనే కాదు అభిన‌యంలోను భాగ్యశ్రీ ది గ్రేట్

ఎవ‌రికైనా ఒక టైమ్ రావాలి. అలాంటి టైమ్ క‌లిసొచ్చింది భాగ్య‌శ్రీకి. కేవ‌లం గ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లోనే కాదు, న‌టించేందుకు అవ‌కాశం ఉన్న పాత్ర‌లు ఆఫ‌ర్ చేస్తే, తాను కూడా త‌గ్గేదేలే అని ఇటీవ‌ల నిరూపిస్తోంది.;

Update: 2025-11-28 03:58 GMT

ఎవ‌రికైనా ఒక టైమ్ రావాలి. అలాంటి టైమ్ క‌లిసొచ్చింది భాగ్య‌శ్రీకి. కేవ‌లం గ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లోనే కాదు, న‌టించేందుకు అవ‌కాశం ఉన్న పాత్ర‌లు ఆఫ‌ర్ చేస్తే, తాను కూడా త‌గ్గేదేలే అని ఇటీవ‌ల నిరూపిస్తోంది. ఇంత‌కుముందు దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత సినిమాలో అద్భుత అభిన‌యంతో ఆక‌ట్టుకున్న భాగ్య‌శ్రీ ఇప్పుడు రామ్ స‌ర‌స‌న న‌టించిన ఆంధ్రా కింగ్ తాలూకాలోను త‌న‌దైన అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ర‌క్తి క‌ట్టించింది.

గ్లామ‌ర్ ని మించి అభిన‌యం..

భాగ్యశ్రీ బోర్సే `గ్లామర్ డాళ్‌` ఇమేజ్ నుంచి పూర్తిగా బయటికి వచ్చినట్లే. `కాంత`లో అదరగొట్టిన ఆమె..`ఆంధ్ర కింగ్ తాలూకా`లోనూ ఆకట్టుకుంది అంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. అందంతో పాటు అభినయంతోనూ భాగ్యశ్రీ మెప్పించింది. సినిమాలోని కీల‌క‌ సన్నివేశాల‌లో త‌న అభిన‌యానికి క్రిటిక్స్ మంచి మార్కులే వేసారు. ముఖ్యంగా భాగ్య‌శ్రీ గ్లామ‌ర్ డాళ్ అనుకుంటే, తనలోని నటిని ఈ సినిమాలో చూడొచ్చు! అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

రామ్ ఇంత‌కుముందు ప్రీరిలీజ్ వేదిక‌పై భాగ్య శ్రీ గురించి అంత ఎమోష‌న‌ల్ గా ఎందుకు మాట్లాడాడో ఈ సినిమా చూసిన త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంది. భాగ్య‌శ్రీ ఇంత గ్లామర్ డాళ్ లా ఉంది.. కానీ ఆడిష‌న్స్ లో త‌న అభిన‌యం చూసి వెంట‌నే ఓకే చేసామ‌ని రామ్ చెప్పారు. దానికి త‌గ్గ‌ట్టే భాగ్య‌శ్రీ సినిమా ఆద్యంతం న‌టిగా రాణించింది. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రానికి క్రిటిక్స్ యునానిమ‌స్ గా అద్భుత‌మైన రేటింగులు ఇచ్చి ప్రోత్స‌హించారు.

వ‌రుస విజ‌యాల‌తో దూకుడు..

ఇప్పుడు కాంత‌, ఆంధ్రా కింగ్ తాలూకా లాంటి విజ‌యాల‌తో భాగ్యశ్రీ రేంజ్ అమాంతం పెర‌గనుంది. పారితోషికాన్ని చుక్క‌ల్లోకి తీసుకెళ్లే క‌థానాయిక‌ల జాబితాలో భాగ్య‌శ్రీ కూడా చేరిపోనుంది. ఈ రెండు విజ‌యాల‌తో భాగ్య‌శ్రీ ఫోటోషూట్ల ప‌రంగాను దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంది. తాజా ఫోటోషూట్ లో ఈ ముగ్ధ‌మ‌నోహ‌రి అంద‌చందాలు మ‌రో లెవ‌ల్ లో ఎలివేట్ అయ్యాయి. సింపుల్ డిజైన‌ర్ డ్రెస్ లో భాగ్య‌శ్రీ ఎంతో క్యూట్ గా ల‌వ్వ‌బుల్ గా క‌నిపిస్తూనే, త‌న‌లోని గ్లామ‌ర్ ని ఎలివేట్ చేసిన తీరుకు బోయ్స్ ముగ్ధులైపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

ప్ర‌తిభ‌కు ప‌ట్టం:

టాలీవుడ్ లో అత్యంత వేగంగా ఎదిగేసిన క‌థానాయిక‌ల జాబితాలో సాయిప‌ల్ల‌వి, కియ‌రా అద్వాణీ, ర‌ష్మిక మంద‌న్న‌, శ్రీ‌లీల పేర్లు మార్మోగుతున్నాయి. ప్ర‌తిభ‌కు ప్ర‌జ‌లు ప‌ట్టంగ‌డ‌గార‌న‌డానికి వీరంతా ఉదాహ‌ర‌ణ‌లు. ఇప్పుడు ఈ జాబితాలో భాగ్య‌శ్రీ పేరు కూడా చేరిపోనుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. భాగ్య‌శ్రీ భ‌విష్య‌త్ ఉజ్వ‌లంగా వెలిగిపోవాల‌ని కూడా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News