నువ్వు అత్యుత్తమ రాముడివి.. భాగ్యశ్రీ గుట్టు తెలిసిపోయే!
ఇదే వేదికపై హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులో మాట్లాడుతూ అందరి హృదయాలను గెలుచుకుంది. తెలుగు నేర్చుకుని మరీ భాగ్యశ్రీ ఎంతో పోయెటిక్ వర్డింగ్ తో మాట్లాడి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది.;
రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ `ఆంధ్ర కింగ్ తాలూకా`తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో రామ్ మైండ్ బ్లోయింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది.
కాన్సర్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. నా కెరీర్ లో గర్వపడే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి చాలా మంది కష్టం ఉంది. దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు చాలా శ్రమించారని, మనసు పెట్టి పని చేసారని రామ్ అన్నారు. ఇక భాగ్యశ్రీ భోర్సేపై రామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మ్ చేసే హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చింది. ఇటీవల వచ్చిన సినిమాలో కూడా అతను అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది.. అని ప్రశంసించాడు.
ఇదే వేదికపై హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులో మాట్లాడుతూ అందరి హృదయాలను గెలుచుకుంది. తెలుగు నేర్చుకుని మరీ భాగ్యశ్రీ ఎంతో పోయెటిక్ వర్డింగ్ తో మాట్లాడి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా భాగ్య శ్రీ రామ్ పై తన ప్రేమను చాటుకుంది. భాగ్య శ్రీ మాట్లాడుతూ -``హలో వైజాగ్. ఈవెంట్ కి వచ్చినా అందరికీ థాంక్యూ. నా చిన్ని గుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. రామ్ గారు అభిమానుల్ని ఎంతగానో ప్రేమించే హీరో. ఆయన కింగ్ ఆఫ్ హార్ట్స్. మీ అందరి ప్రేమకు ఆయన అర్హులు. నవంబర్ 27న అందరూ కూడా ఈ సినిమాని చూడాలని కోరుతున్నాను`` అని అన్నారు.
రామ్ ని ఉద్ధేశించి మాట్లాడుతూ .. నువ్వు అత్యుత్తమ రాముడివి. నీ విజయం లేదా వైఫల్యం ఎలా ఉన్నా, నువ్వు ఉన్నత స్థానంలో ఉన్నా లేకపోయినా మేము నిన్ను ప్రేమిస్తున్నాము! అని కూడా భాగ్యశ్రీ అంది. నిజానికి ఈ అందాల భరిణె మనసులోని మాటలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. భాగ్యశ్రీ రాముడి గురించి ఎందుకు అంత భావోద్వేగంగా మాట్లాడిందో ఆశ్చర్యంగా ఉంది. ఆమె ప్రసంగం వింటూ రామ్ కూడా షాక్ అయ్యాడు.
ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మార్విన్ మాట్లాడుతూ.. మాకు ఇంత మంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పినా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కి ధన్యవాదాలు. డైరెక్టర్ మహేష్ అద్భుతమైన సినిమా తీశారు. ఉపేంద్ర గారికి మేము పెద్ద ఫ్యాన్స్. ఆయనతో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మ్యూజిక్ ఇంత అద్భుత అద్భుతంగా రావడానికి కారణం రామ్ గారు. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేము. ఆయన ఇచ్చిన ఎనర్జీ అద్భుతం. ఆయన ఎనర్జీ వల్లే సాంగ్స్ ఇంత అద్భుతంగా వచ్చాయి. నవంబర్ 27న తప్పకుండా ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.