మరో రేంజ్ కు వెళ్లేలా బెల్లంకొండ భైరవం!

బెల్లంకొండ పర్ఫార్మెన్స్‌ ప్రత్యేకంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్ హార్డ్ వర్క్ ను గురించి యూనిట్‌ సభ్యులే గొప్పగా చెబుతున్నారు.;

Update: 2025-05-26 17:40 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కెరీర్‌లో ఓ కీలక మలుపుగా నిలవబోతున్న సినిమా ‘భైరవం’. మాస్‌ కమర్షియల్‌ హంగులతో పాటు, డీప్‌ ఎమోషనల్‌ కాన్టెంట్‌ మిక్స్‌ చేసిన ఈ చిత్రం ట్రైలర్‌ నుంచే హైప్‌ను క్రియేట్‌ చేస్తోంది. డ్యాన్సులు, ఫైట్స్‌తో పాటు యాక్షన్‌, ఎమోషన్‌ బలంగా కలిపిన కథాంశంతో ఈసారి బెల్లంకొండ తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నాడు.

గరుడన్‌ అనే తమిళ హిట్‌ సినిమాకు రీమేక్‌గా రూపొందినప్పటికీ, తెలుగు నేటివిటీకి అనుగుణంగా డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడల చేసిన మార్పులు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటల ద్వారా బెల్లంకొండ తన మాస్‌ ఎనర్జీని మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా గిచ్చమాకు పాటలోని డాన్స్‌ మూమెంట్స్‌ నుంచి యాక్షన్‌ సీన్‌ల వరకూ సాయి శ్రీనివాస్‌ అందరినీ ఆకట్టుకున్నాడు.

టాలీవుడ్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు ఉన్నా, ఇప్పటి వరకు ఆ స్థాయిలో స్థిరపడలేని బెల్లంకొండకు ఈ సినిమా బ్రేక్‌ ఇవ్వబోతోందన్న ఫీల్‌ ఇండస్ట్రీలో స్పష్టంగా వినిపిస్తోంది. ట్రైలర్‌లో చూపించిన కొత్త లుక్‌, రగ్గడ్‌ ప్రెజెన్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా పూర్తి అయిన సెన్సార్‌ ప్రక్రియలో ‘భైరవం’కు A సర్టిఫికెట్‌ లభించింది. సినిమా రన్‌టైం 2 గంటల 35 నిమిషాలు. యాక్షన్‌, ఎమోషన్‌ కలబోసిన ఈ సినిమా మంచి మౌత్‌ టాక్‌ తెచ్చుకునేలా ఉందని సెన్సార్‌ రిపోర్ట్‌ తెలిపింది.

బెల్లంకొండ పర్ఫార్మెన్స్‌ ప్రత్యేకంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్ హార్డ్ వర్క్ ను గురించి యూనిట్‌ సభ్యులే గొప్పగా చెబుతున్నారు. ప్రస్తుతం ‘భైరవం’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న బెల్లంకొండ.. మరోవైపు వరుస సినిమాలతో కష్టపడుతున్నాడు. ‘టైసన్‌ నాయుడు’, ‘కిష్కిందపురి’, ‘హైందవం’ వంటి పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ప్రాజెక్టులు సెట్స్‌పై ఉన్నాయి.

అయితే ‘భైరవం’ హిట్‌ అయితే మాత్రం ఈ సినిమాల బిజినెస్‌లో బెల్లంకొండ రేంజ్‌ మొత్తం మారిపోతుంది. మాస్‌ హీరోగా నిలదొక్కుకోవాలంటే, ఈ సినిమాతో అతడు ఖచ్చితంగా ఒక మెట్టు ఎక్కాలి. ఈ నెల 30న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న ‘భైరవం’ బెల్లంకొండ కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అవుతుందా? స్టార్డమ్‌కు గేట్స్‌ ఓపెన్‌ అవుతాయా? అన్నది తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News