• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు ఫ్లాప్‌ ఎఫెక్ట్...

చిరు ఫ్లాప్‌ ఎఫెక్ట్ బెల్లంకొండ మూవీపై లేనట్లే!

| ఈ మధ్య కాలంలో వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ ఒక్కటైనా భారీ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోలేక పోతోంది

By - Tupaki Desk
Update: 2023-10-26 07:00 GMT

ఈ మధ్య కాలంలో వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ ఒక్కటైనా భారీ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోలేక పోతోంది. అఖిల్ తో రూపొందించిన ఏజెంట్‌ సినిమా అతి పెద్ద కమర్షియల్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక చిరంజీవి భోళా శంకర్ సినిమా కూడా అనిల్ సుంకర నిర్మించగా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే.

చిరంజీవి భోళా శంకర్ కమర్షియల్ గా ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ కి ఆర్థిక సమస్యలను తెచ్చి పెట్టిందని.. అందుకే ఆయన బ్యానర్ లో కొత్త సినిమాలు ఇప్పట్లో రావని, ఇప్పటికే మొదలైన సినిమాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది అంటూ ప్రచారం జరిగింది. దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా అటకెక్కినట్లే అని అంతా అనుకున్నారు.

సాగర్ చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా అనిల్ సుంకర నిర్మాణంలో ఒక సినిమా చాలా రోజుల క్రితం ప్రారంభం అయింది. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ చిత్రీకరణ జరిపారు. కొత్త షెడ్యూల్‌ కి సమయం తీసుకుంటున్నారు. ఈ సమయంలో భోళా ఎఫెక్ట్‌ తో ఎకే ఎంటర్ టైన్మెంట్‌ బ్యానర్ సినిమాలన్నీ ఆగిపోయాయి.. అందులో ఇది కూడా ఉందనే ప్రచారం మొదలైంది.

మీడియాలో జరుగుతున్న ప్రచారం నూటికి నూరు శాతం అవాస్తవం అని తేలిపోయింది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ను ఈనెల 30 న మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ కూడా ఈ షెడ్యూల్‌ లో ప్లాన్ చేశారట.

అనిల్ సుంకర పెద్ద వ్యాపారస్తుడు. ఆయన సినిమాల యొక్క బడ్జెట్‌ విషయంలో అంత ఆశామాషీగా వ్యవహరించే వ్యక్తి కాదు. ప్రతి దానికి లెక్కలు ఉంటాయి. కనుక ఆయన ఆర్థిక సమస్య ల్లో చిక్కుకోవడం అనేది కచ్చితంగా జరిగే పనే కాదు. ఆయన నుంచి పదుల సంఖ్యలో సినిమాలు ముందు ముందు వస్తాయి. వాటిల్లో మంచి విజయాలు దక్కించుకోబోతున్న సినిమాలు కూడా ఉండబోతున్నాయి అంటూ కొందరు ఆయన సన్నిహితులు తాజా పుకార్లకు కౌంటర్ ఇస్తున్నారు.

Tags:    
  • Chiranjeevi 
  • Bellamkondasreenivas 
  • Anilsunkara 
  • Akentertainments 
  • Filmindustry 
  • Sagarchandra 

Similar News

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

Copyright @2026

Powered by Blink CMS