కట్టె కాలే వరకు సినిమాలే చేస్తా..!

ఐతే దీనిపై మరోసారి స్పందించాడు బెల్లంకొండ శ్రీనివాస్. లేటెస్ట్ గా జరిగిన కిష్కింధపురి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ....;

Update: 2025-09-11 06:31 GMT

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిధపురి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో సినిమా మొదలైన 10 మినిట్స్ లోనే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారని.. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత ఫోన్ ముట్టుకోలేరని అలా ఫోన్ చూస్తే తాను సినిమాలు ఆపేస్తా అంటూ చెప్పాడు. సినిమా గురించి ఎంత చెప్పినా ఆ విషయాలను పట్టించుకోరు కానీ ఇలా ఒక్క మాట అనగానే దాని మీదే విపరీతమైన కామెంట్స్, ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిధపురి సినిమా కన్నా ఈ కామెంట్ వీడియోనే వైరల్ అయ్యింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బెల్లంకొండ శ్రీనివాస్..

ఐతే దీనిపై మరోసారి స్పందించాడు బెల్లంకొండ శ్రీనివాస్. లేటెస్ట్ గా జరిగిన కిష్కింధపురి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమా మొదలైన 10 నిమిషాల తర్వాత ఫోన్ చూస్తే సినిమాలు వదిలేస్తానని అందరు అంటున్నారు. అసలు నేనెందుకు వదిలేస్తా అండి.. సినిమాలు ఇష్టపడ్డాను.. కష్టపడుతున్నాను.. ఇండస్ట్రీలోనే ఉంటాను. కట్టె కాలె వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. ఒక సినిమా వెనక ఎంతోమంది కష్టం ఉంటుంది. దాని కోసం సినిమాలను ఆదరించాలని అన్నారు.

సినిమాను ఆడియన్స్ కి చేరవేయడంలో ఈ ప్రమోషన్స్ అనేవి పెద్ద పీఠ వేస్తున్నాయి. అందుకే ప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లాన్స్ చేస్తుంటారు. ఐతే ఈ క్రమంలో సినిమా గురించి వాళ్లు చేసే కామెంట్స్ కొన్ని వైరల్ అవుతాయి. దాన్ని పట్టుకుని నెటిజెన్లు హడావిడి చేస్తారు. ఐతే అదంతా వాళ్లు సినిమాకు ప్లస్ అవ్వాలనే సెలబ్రిటీస్ కామెంట్స్ చేస్తారు కానీ మైనస్ అవ్వాలని ఏమాత్రం కాదు.

థ్రిల్లింగ్ హార్రర్ ఎలిమెంట్స్..

కిష్కింధపురి సినిమా హర్రర్ జోనర్ లో వస్తున్న సినిమా. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించారు. సినిమా ప్రీమియర్ ఆల్రెడీ పడిందని టాక్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, హార్రర్ ఎలిమెంట్స్ ఇంప్రెస్ చేశాయని అంటున్నారు. మరి అసలు ఆడియన్స్ నుంచి సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో కమర్షియల్ సక్సెస్ అనిపించుకున్న సినిమా రాక్షసుడు. ఆ సినిమాలో కూడా అనుపమ హీరోయిన్ గా చేసింది. మళ్లీ ఈ కాంబోలో కిష్కింధపురి వస్తుంది. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు ఆడియన్స్ లో హర్రర్ జోనర్ చూసే పర్సెంటేజ్ తక్కువే అయినా అలాంటి సినిమాలు మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తే వాటిని బాగా ఆదరిస్తారు. కౌశిక్ చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News