బెల్లంకొండ.. 2025లో మరొకటి..

అయితే 2025లో ఇప్పటి వరకు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.;

Update: 2025-10-07 17:37 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన.. ఇప్పుడు పదేళ్లకి పైగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో మెప్పించిన బెల్లంకొండ.. తెలుగు చిత్రాలకు నాలుగేళ్ల బ్రేక్ ఇచ్చారు. హిందీ ఛత్రపతి రీమేక్ వల్ల ఆ బ్రేక్ వచ్చింది.

అయితే 2025లో ఇప్పటి వరకు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మే నెలలో భైరవం మూవీతో థియేటర్స్ లో ఆయన సందడి చేశారు. తమిళ మూవీ గరుడన్ కు రీమేక్ గా రూపొందిన ఆ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నారు. కానీ తన యాక్టింగ్ తో మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

రీసెంట్ గా బెల్లంకొండ నటించిన కిష్కింధపురి మూవీ.. రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. హారర్ కామెడీ జోనర్ లో కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన ఆ సినిమా.. అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. బెల్లంకొండ శ్రీనివాస్ కు సరైన హిట్.. కిష్కింధపురి రూపంలో దక్కిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే ఇప్పుడు 2025లో మరో మూవీతో సందడి చేయనున్నారు బెల్లంకొండ. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న టైసన్ నాయుడు ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా ఆ సినిమా విడుదల అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి.. క్రిస్మస్ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్.. డెకాయిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ ఆయన రీసెంట్ గా గాయపడ్డారు. దీంతో షూటింగ్ పెండింగ్ ఉండిపోవడంతో రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్. ఇప్పుడు క్రిస్మస్ రేస్ లోకి టైసన్ నాయుడు మూవీ వచ్చింది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.

మూవీ లో సాయి శ్రీనివాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన భీమ్లా నాయక్ తర్వాత సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిదే కావడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలతో మూవీ రూపొందుతున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చింది. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News