బిగ్ బాస్ 9 అతని కెప్టెన్సీ త్యాగం.. అసలేం జరిగింది..?
ఇక హరీష్ మీద సంజన చేసిన కామెంట్స్ పై అతను నాగార్జునతో డిస్కస్ చేశాడు. ఐతే హరీష్ పవన్ ని లత్కోర్ పనులు అని అనడం గురించి డిస్కషన్ జరిగింది.;
బిగ్ బాస్ సీజన్ 9లో శనివారం ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా మిడ్ వీక్ ఎలిమినేట్ గా వచ్చిన సంజనతో నాగార్జున హౌస్ లో ఒక్కొక్కరికి ఒక మెసేజ్ ఇవ్వమని అడిగితే కొంతమందికి బాగానే క్లాస్ పీకింది సంజన. ముఖ్యంగా రాము రాథోడ్, హరీష్ గురించి ఆమె కాస్త ఫైర్ అయ్యింది. ఇక సంజన హౌస్ లోకి మళ్లీ తిరిగి రావాలంటే ఆమె బ్యాటరీ 100 శాతం నింపాలని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ఈ క్రమంలో తను స్లిప్ తీసి అందులో ఎవరి పేరు వచ్చి వాళ్లకు ఏ సాక్రిఫైజ్ వస్తే అది చేయాలి. ముందు ఇమ్మాన్యుయెల్ కి కెప్టెన్సీ సాక్రిఫైజ్ అని రాగానే అతను నిమిషం ఆలోచించకుండా కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసేశాడు.
శ్రీజ క్లాత్స్ సాక్రిఫైజ్..
నెక్స్ట్ తనూజా ఈ సీజన్ మొత్తం కాఫీ త్యాగం చేయాలని కోరితే దానికి ఒప్పేసుకుంది. శ్రీజ తన క్లాత్స్ సాక్రిఫైజ్ చేయాలంటే ఆమె ఒప్పుకోలేదు. రీతూ చౌదరి హెయిర్ ని కట్ చేసుకోవాలంటే ఆమె కాస్త బాధపడుతూనే హెయిర్ కట్ చేసుకుంది. ఇక సుమన్ శెట్టి సిగరెట్స్ హౌస్ లో ఉన్నన్నాళ్లు మానేయాలని అంటే అతను ఒప్పుకోలేదు. చివరగా భరణి తన సీక్రెట్ బాక్స్ స్టోర్ రూం లో పెట్టాలంటే దాన్ని పెట్టేశాడు. ఫలితంగా సంజన బ్యాటరీ 100 పర్సెంట్ ఫుల్ అయ్యి ఆమె హౌస్ లోకి వెళ్లింది.
ఇక హరీష్ మీద సంజన చేసిన కామెంట్స్ పై అతను నాగార్జునతో డిస్కస్ చేశాడు. ఐతే హరీష్ పవన్ ని లత్కోర్ పనులు అని అనడం గురించి డిస్కషన్ జరిగింది. శ్రీజ, ప్రియ కూడా హరీష్ చేసిన కామెంట్ రాంగ్ అని అన్నారు. శ్రీజకు సంచాలక్ గా డెసిషన్ గురించి నాగార్జున తొందరపడొద్దని చెప్పారు. శనివారం ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న ఎవరినీ సేవ్ చేయలేదు.
బిగ్ బాస్ ఓనర్స్, టెనంట్స్..
అంతేకాదు హౌస్ లో ఓనర్స్, టెనంట్స్ అనే తేడా లేకుండా అందరు అన్నిచోట్ల కలిసి తిరుగుతున్నారు.. తింటున్నారు. దాని గురించి కూడా నాగార్జున చెప్పారు. బిగ్ బాస్ ఓనర్స్, టెనంట్స్ పెట్టింది ఎందుకో అర్ధం చేసుకోవాలని అన్నారు. సో శనివారం ఎపిసోడ్ అంతా కూడా సంజన కోసం సాక్రిఫైజ్ సీన్, హౌస్ లో జరిగిన విషయాల గురిచి డిస్కషన్ చేశారు నాగార్జున.
బిగ్ బాస్ సీజన్ 9లో కొత్తగా వచ్చిన దివ్య నిఖిత ఇచ్చిన ఇన్ పుట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. హౌస్ మెట్స్ ని బయట ఉండి చూసిన ఆమె లోపలకు వెళ్లాక తన మాటలతోనే వాళ్లను ఎటాక్ చేస్తుంది. దివ్యా ఆట ఎలా ఉంటుందో కానీ మాట తీరు మాత్రం ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. తన స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్.. ఇంకా క్లారిటీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది.