ఏం చేస్తే జనాలు థియేటర్లకు వస్తారో అర్థం కావడం లేదు: డైరెక్టర్ ఎమోషనల్

ప్రమోషన్స్ సమయంలో సినిమా బాగా లేకుంటే.. నన్ను చెప్పుతో కొట్టండి.. అని డైరెక్టర్ కాన్ఫిడెంట్ గా చెప్పారు.;

Update: 2025-08-31 15:14 GMT

సినిమా ప్రేక్షకుల నాడి అంతుచిక్కడం లేదు. ప్రస్తుత రోజుల్లో సినిమాలు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ సాధించుకుంటున్నాయో.. అస్సలు అర్థం కావడం లేదు. సినిమా ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఒక్కోసారి ప్రేక్షకుల ఆదరణ తక్కువవుతోంది. ప్రమోషన్స్, ఆకట్టుకునే ట్రైలర్, టీజర్, స్టార్ తారాగణం ఉన్నప్పటికీ ఆడియెన్స్ ఆదరణ దక్కువవుతోంది.


అచ్చం అలాంటి పరిస్థితే తాజాగా రిలీజైన త్రిబాణధారి బార్బరిక్ సినిమాకు ఎదురువుతోంది. ఈ సినిమా కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ.. థియేటర్లలో ప్రేక్షకుల ఆక్యుపెన్సీ తక్కువగా నమోదు అవుతోంది. చూసిన కొద్దిపాటి ప్రేక్షకులు సినిమా బాగుందని రివ్యూ ఇచ్చినా.. లార్జ్ స్కేల్ ఆడియెన్స్ కు సినిమా రీచ్ అవ్వడం లేదు. ఒకరకంగా ఇది మేకర్స్ కు నిరాశ పర్చే విషయం. అయితే ఈ సినిమా స్పందనపై డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స భావోద్వేగానికి గురయ్యారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.

ప్రమోషన్స్ సమయంలో సినిమా బాగా లేకుంటే.. నన్ను చెప్పుతో కొట్టండి.. అని డైరెక్టర్ కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇది ఆడియెన్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుందని అనుకున్నా.. అది జరగలేదు అంటూ సినిమా టాక్ బాగున్నా.. ఇలాంటి పూర్ ఆక్యుపెన్సీ రావడం బాధగా ఉందని అన్నారు. ఈ సినమా కోసం ఆయన రెండున్నరేళ్లు కష్టపడినట్లు చెప్పారు. కానీ ఇలాంటి పూర్ ఆక్యుపెన్సీ నమోదు కావడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. బార్బరిక్ సినిమాకు నేను వెళ్లాను. ఈ సినిమాను నేనే తెరకెక్కించాను. థియేటర్ హాలులో పది మందే ఉన్నారు. అయితే ఆ పది మందిని నేను డైరెక్టర్ అని చెప్పకుండా.. సినిమా గురించి అడిగాను. వాళ్లు సినిమా బాగుంది అని చెప్పారు. నిజం చెప్పండి నేనే ఈ సినిమా డైరెక్టర్ నేనే అని వాళ్లకు చెప్పాను. వాళ్లు నన్ను హగ్ చేసుకొని మరీ సినిమా బాగుంది అని చెబితే.. నాకు కళ్లలో నీళ్లు ఆగలేదు.

అయితే సినిమా బాగున్నప్పటికీ.. ఎందుకు 10మందే థియేటర్లలో ఉన్నారు, ఇంకా ఏం చేస్తే, జనాలు సినిమాకు వస్తారు. రెండున్నరేళ్ల కష్ట పడ్డా. మలయాళం కంటెంట్ లు, మంచి కంటెంట్ లు ఆడియెన్స్ థియేటర్లలో చూస్తారని నేనూ ఈ సినిమా తీశాను. అంతే కాన్ఫిడెంట్ గా సినిమా నచ్చకపోతే నా చెప్పుతో కొట్టుకుంటా అని కూడా చెప్పాను.

అయినా ప్రేక్షకులు రాలేదు. మరి ఏం చేస్తే జనాలు థియేటర్లకు వస్తారో నాకు అర్థం అవ్వడం లేదు. సినిమాకు ఓసారి వెళ్లి చూసి, బాగాలేదు అని అంటే నేను ఒప్పుకుంటా. అసలు మీరు సినిమాకే రాకపోతే నాకెలా తెలుస్తుంది. అందుకే నేను మలయాళం ఇండస్ట్రీకి వెళ్లిపోతా. అక్కడే సినిమా తీస్తా. అక్కడి సినిమా తెలుగోడు తీస్తే.. ఎలా ఉంటుందో తెలుగు ఆడియెన్స్ కు నిరూపించుకుంటాను. అని డైరెక్టర్ మోహన్ భావోద్వేగానికి గురయ్యారు.

కాగా, ఆయన తెరకెక్కించిన త్రిబాణధారి బార్బరిక్ ఆగస్టు 29న గ్రాండ్ గా రిలీజైంది. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోషల్ మెసేజ్‌ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్‌ గా సినిమా రూపొందింది. సినిమా ప్రేక్షుకులు, రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. అయితో చాలా తక్కువ ఆక్యుపెన్సీతో రన్ అవ్వడంతో దర్శకుడు ఎమోషనల్ అయ్యారు.

Tags:    

Similar News