ట్రెండింగ్: వర్క్ ఫ్రమ్ హోం కాదు వర్క్ ఫ్రం థియేటర్..
అయితే ఐటీ ఉద్యోగాలు చేసే వారికి ఒత్తిడి పై అధికారుల నుంచి ఏ రేంజ్ లో ఉంటుందో కొన్ని కొన్ని ఘటనలు చూస్తే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.;
ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేసే వ్యక్తులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఐటి జాబ్స్ చేసేవారు డబ్బులు సంపాదిస్తారు.కానీ మానసిక ప్రశాంతత మాత్రం కోల్పోతారు. ప్రస్తుత కాలంలో ఐటీ జాబ్స్ చేసే వారిలోనే ఎక్కువగా సంతానలేమి సమస్యలు, గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వారు చేసే పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉండడం అని నిపుణులు అంటున్నారు.
అయితే ఐటీ ఉద్యోగాలు చేసే వారికి ఒత్తిడి పై అధికారుల నుంచి ఏ రేంజ్ లో ఉంటుందో కొన్ని కొన్ని ఘటనలు చూస్తే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తాజాగా బెంగళూరులో జరిగినటువంటి ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా మనం సినిమా థియేటర్ కు వెళ్ళేది రిలాక్స్ అవ్వడానికి మాత్రమే.. సినిమాలు చూసి ఎంజాయ్ చేసి కాసేపు ఆనందిస్తామని వెళ్తాము.. అలాంటి సినిమా థియేటర్లో కూడా లాప్ టాప్ ఆన్ చేసి పనిలో నిమగ్నమై ఓవైపు పని చేస్తూ మరోవైపు సినిమా చూస్తూ కనిపించింది ఓ మహిళ. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్యకాలంలో ఒక మహిళ కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లేడీ సూపర్ హీరో మూవీ 'కొత్త లోక' చిత్రం చూడడానికి థియేటర్ కు వెళ్ళింది.
ఆమె సినిమా చూస్తూ ఓవైపు లాప్ టాప్ లో పనిచేస్తూ కనిపించింది. ఆమె వెనక కూర్చున్న ఒక వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీసి తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు బెంగళూరులో ఉద్యోగాలు చేసే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ అయింది.. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐటీ కార్పోరేట్ సంస్థలు ఉద్యోగులను ఎలా బానిసలలాగా వాడుకుంటున్నారో ఇది చూస్తే అర్థమవుతుందని అంటున్నారు.
మరి కొంతమంది ఇది "వర్క్ ఫ్రం హోం కాదు వర్క్ ఫ్రం థియేటర్ "అంటూ కాస్త వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. వినోదం కోసం వచ్చి ఇలా ఇబ్బందులు పడుతున్నారని మరి కొంతమంది అంటున్నారు. కనీసం కార్పొరేట్ సంస్థలు ఒక ఉద్యోగిని ఎంజాయ్ కూడా చేయనివ్వకుండా ఒత్తిడికి గురిచేస్తున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇంకొంతమంది అంత వర్క్ ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు కదా.. ఎప్పుడైనా సినిమా చూడొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఐటి మహిళా ఉద్యోగి థియేటర్లో కూడా వర్క్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పవచ్చు.