బాలకృష్ణ మరో సీక్వెల్‌ చేస్తారా..?

నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్‌ హిట్ కావడంతో బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సైతం చేసిన విషయం తెల్సిందే.;

Update: 2025-08-25 19:30 GMT

నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్‌ హిట్ కావడంతో బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సైతం చేసిన విషయం తెల్సిందే. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు భారీ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అఖండ కు సీక్వెల్‌గా రూపొందిన అఖండ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సీక్వెల్‌ హిట్‌ అయితే బాలకృష్ణ నుంచి మరిన్ని సీక్వెల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇటీవల బాలకృష్ణ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'వీర సింహారెడ్డి' సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో సినిమాను వీరిద్దరూ కలిసి చేయబోతున్నారు.

బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబో..

వీర సింహారెడ్డి సినిమా తర్వాత గోపీచంద్‌ మలినేని ఇండస్ట్రీ వర్గాల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకున్నాడు. ఆ సినిమా హిట్‌ కావడంతో ఏకంగా బాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్‌ దక్కించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ పిలిచి మరీ ఆఫర్‌ ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా కన్ఫర్మ్‌ అయింది. దసరా కానుకగా ఆ సినిమాను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమాలు జరిపేందుకు గాను ఏర్పాట్లు జరుపుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ లోపు గోపీచంద్‌, బాలకృష్ణ కాంబోలో రూపొందబోతున్న సినిమా వీర సింహారెడ్డి సినిమాకు సీక్వెల్‌ అంటూ తెగ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీర సింహారెడ్డి పాత్రను కంటిన్యూ చేస్తూ కొన్ని పాత్రలను కంటిన్యూ చేస్తూ కొత్త కథతో ఈ సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వీర సింహారెడ్డికి సీక్వెల్‌..

ఇప్పటి వరకు దర్శకుడు గోపీచంద్‌ మలినేని నుంచి ఈ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా ఆయన సన్నిహితులు వీర సింహారెడ్డికి ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని రెడీ చేస్తున్న స్క్రిప్ట్‌కి సంబంధం లేదు అంటున్నారు. బాలకృష్ణ చేసిన హిట్‌ మూవీ వీర సింహారెడ్డి కి సీక్వెల్‌ చేసే స్కోప్‌ లేదని, పుకార్లు పుట్టించవద్దు అంటూ కొందరు అంటున్నారు. అయితే దర్శకుడు తలుచుకుంటూ సీక్వెల్‌ను క్రియేట్‌ చేయడం పెద్ద కష్టం అయిన పని ఏం కాదు. అందుకే ఇప్పుడు జనాలు సీక్వెల్‌ కోసం ఎదురు చూస్తున్నారు. సీక్వెల్‌ ట్రెండ్ నడుస్తుంది కనుక వీర సింహారెడ్డి సినిమాకు సీక్వెల్‌ చేయడం అనేది మంచి ఆలోచన అని, ఆ మంచి ఆలోచన గోపీచంద్‌ మలినేని చేస్తే ఖచ్చితంగా హిట్‌ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అఖండ 2 రిలీజ్ కోసం వెయిటింగ్‌

ఈ మధ్య కాలంలో హిట్‌ సినిమాలకు సీక్వెల్స్‌, ప్రాంచైజీలను తీయడం కామన్‌గా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమాకు ఖచ్చితంగా సీక్వెల్‌ తీస్తే బాగుంటుందని పలువురు సినీ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ గోపీచంద్‌ మలినేని మాత్రం ఆ దిశగా స్క్రిప్ట్‌ ను రెడీ చేయడం లేదని, పూర్తిగా కొత్త కథ తో సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు బాలకృష్ణ అఖండ 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ అఖండ 2 సినిమా హిట్ అయితే మూడో పార్ట్‌ కూడా వస్తుందేమో చూడాలి. మరో వైపు బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కాంబో మూవీ 2025 దసరాకు ప్రారంభం అయ్యి, 2026 సమ్మర్‌ లేదా దసరా వరకు విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News